Drinking Water Benefits: మనిషికి నీరు అవసరమే. కానీ నీరు తాగే సమయాలు కూడా ఉంటాయి. నీరు ఎప్పుడు తాగాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే దానిపై ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. మనిషిలో దాదాపు తొంభై శాతం నీరే ఉంటుంది. దీంతో మనకు ఆరోగ్యాన్ని రక్షించేది నీరే. ఉదయం నిద్ర లేవగానే నీరు తాగడం ఉత్తమం. ఐతే వేడి నీరు తాగితే మరింత ప్రయోజనం కలుగుతుంది. శరీర అవయవాలు ఉత్తేజమవుతాయి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే వ్యాయామం తప్పనిసరి. వ్యాయామం చేసిన తరువాత నీరు తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. వ్యాయామం చేసిన తరువాత నీరు తాగడం వల్ల గుండె వేగం నెమ్మదిస్తుంది. శరీర భాగాలు సాధారణ స్థితికి చేరుతాయి.

స్నానం చేయడానికి ముందు కూడా నీరు తాగితే ఫలితం ఉంటుంది. స్నానం చేయడానికి కొద్ది నిమిషాల ముందు నీరు తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇటీవల కాలంలో చాలా మందికి బీపీ సాధారణంగా మారింది. దీంతో రక్తపోటును కంట్రోల్ చేసేందుకు నీరు కూడా ప్రధాన ఆయుధంగా మారుతుంది. భోజనానికి అరగంట ముందు నీరు తాగితే కూడా లాభాలున్నాయి. మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావాలంటే అన్నం తినే ముందు నీరు తాగడం మంచిది కాదు. దీంతో నీరు తాగడం కోసం కొన్ని సమయాలను సూచించుకోవడం శ్రేయస్కరం.
పడుకునే ముందు కూడా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. రోజులో మనం కోల్పోయిన ద్రవాల్ని తిరిగి పొందే వీలుంటుంది. పడుకునే ముందు నీరు తాగితే మన శరీరం రిలీఫ్ గా ఉంటుంది. నీరసంగా ఉన్నప్పుడు నీరు తాగితే తక్షణమే శక్తి వస్తుంది. దీంతో మనం నీరు తాగడం మనిషికి సానకూలాంశమే. నీరు క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు నీరు తాగితే శరీరం డీహైడ్రేడ్ కాకుండా నిరోధిస్తుంది. అవయవాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.

గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు నీరు తాగితే బాగుంటుంది. ఇన్ఫెక్షన్ కారణంగా గొంతు నొప్పిగా ఉంటే నీరు తాగితే ఉపశమనం ఉంటుంది. గోరువెచ్చని నీరు తాగితే ఎన్నో లాభాలున్నాయి. ఇలా నీరు తాగేందుకు సమయం కేటాయించుకుంటే సరి. ఎప్పుడు పడితే అప్పుడు నీరు తాగకూడదు. దానికి ప్రత్యేకంగా కొన్ని సమయాలు ఉంటాయి. అందుకే నీరు అదే సమయంలో తాగితే మేలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో నీరు తాగకపోతేనే అనర్థం. మన ఆరోగ్యం కోసం నీరు తాగితే మంచి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవాలి.