Homeఎంటర్టైన్మెంట్S S Rajamouli Aamir Khan Controversy Story: రాజమౌళి ని అవమానించిన బాలీవుడ్ హీరో...కట్...

S S Rajamouli Aamir Khan Controversy Story: రాజమౌళి ని అవమానించిన బాలీవుడ్ హీరో…కట్ చేస్తే ఆ హీరోకి షాక్ ఇచ్చిన జక్కన్న…

S S Rajamouli Aamir Khan Controversy Story: సినిమా ఇండస్ట్రీ లో ఏ రోజు ఏ నటుడు ఏ స్థాయి లో ఉంటాడో ఎవ్వరికి తెలీదు. కాబట్టి టాప్ లో ఉన్నవాళ్ళు ఎక్కువ బిల్డప్ ఇవ్వకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అలా కాకుండా ఓవర్ యాక్షన్ చేస్తే పాతాళానికి పడిపోయే ప్రమాదమైతే ఉంది…నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడు ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అయిన కూడా ఆయన ఎక్కడ ఆ గర్వమైతే చూపించడు… అందరితో బాగా కలిసిపోతాడు. చక్కగా మాట్లాడుతాడు… ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు మన దర్శకులను పట్టించుకునేవాళ్ళు కాదు. కారణమేంటంటే ఇండియాలో వాళ్ళను మించిన హీరోలు లేరు…వాళ్ళు ఏది చెబితే అది జరుగుతుందనే పొగరు వాళ్లకు ఎక్కువైంది…ఇక ఆ క్రమంలోనే రాజమౌళి అమీర్ ఖాన్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడట.

కానీ అమీర్ ఖాన్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో రాజమౌళి కి అది ఇన్సల్ట్ గా అనిపించిందట. అందుకే ఆయన మరోసారి బాలీవుడ్ హీరోలకు కథలు చెప్పడానికి రావద్దు అని డిసైడ్ అయ్యాడట…అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు… వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు…

ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే ఆయన ప్రపంచస్థాయి ప్రేక్షకులను మెప్పించినవాడవుతాడు… ఇక ఈ క్రమంలోనే ఆయనతో సినిమా చేయడానికి అమీర్ ఖాన్ తీవ్రమైన ప్రయత్నం చేసినప్పటికి రాజమౌళి మాత్రం ఆయన్ని పట్టించుకోవడం లేదు…సినిమా టాపిక్ వచ్చిన ప్రతి సారి తనకు కమిట్ మెంట్స్ ఉన్నాయని చెబుతూ తప్పించుకుంటున్నాడట.

మొత్తానికైతే మనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తే మనం అలానే ప్రవర్తించాలి అనే మాటను రాజమౌళి బాగా నమ్ముతాడు. అందుకే అమీర్ ఖాన్ ను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఇప్పుడు చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version