Ram Charan vs NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోలు నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య కూడా ఇలాంటి ఒక పోటీ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక ఎన్టీఆర్ చేసిన దేవర సినిమా సక్సెస్ ని సాధించింది. కానీ ఆ తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ‘వార్ 2’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే అటు ఎన్టీఆర్,ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా మన సినిమాలతో డిఫరెంట్ ప్రయత్నాలైతే చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు.
మూడు వేరియేషన్స్ చూపించే పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు… ఇక ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకుంది.
కాబట్టి ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది అంటూ అటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ పెద్ది సినిమా ఈ సంవత్సరం వస్తుంది. డ్రాగన్ సినిమా వచ్చే సంవత్సరం రానున్న నేపథ్యంలో రామ్ చరణ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య పోటీ అయితే ఉంది.
వీళ్లిద్దరు చేస్తున్న రెండు సినిమాలు ఏ రేంజ్ కలెక్షన్స్ ని రాబడతాయి. ఒకదానితో ఒకటి ఎంత వరకు పోటీ పడతాయి అనేది తెలియాల్సి ఉంది. ఇక అల్టిమేట్ గా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అయినప్పటికి సినిమాల పరంగా మాత్రం వాళ్ల మధ్య ఎప్పుడు పోటీ ఉంటుందని వాళ్లే పలు సందర్భాల్లో చెప్పడం విశేషం…
