Homeఎంటర్టైన్మెంట్NTR Dragon Update: ఎన్టీఆర్ డ్రాగన్, ప్రభాస్ ఫౌజీ మూవీ విషయంలో ఏం జరుగుతుంది... అప్డేట్...

NTR Dragon Update: ఎన్టీఆర్ డ్రాగన్, ప్రభాస్ ఫౌజీ మూవీ విషయంలో ఏం జరుగుతుంది… అప్డేట్ ఏంటి…

NTR Dragon Update: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. ‘వార్ 2’ సినిమాను మినహాయిస్తే అంతకుముందు చేసిన సినిమాలు అన్ని సక్సెస్ లను సాధించాయి. టెంపర్ నుంచి దేవర వరకు వరుసగా ఏడు సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఆయన ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. దానికి సంబంధించిన న్యూస్ ను కూడా ఇప్పటివరకు రివిల్ చేయలేదు.

టైటిల్ గాని, గ్లింప్స్, టీజర్ ఏ ఒక్కటి కూడా రిలీజ్ చేయకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుంది… అసలు సినిమా షూటింగ్ జరుగుతుందా? లేదా అనే ధోరణిలో ఆలోచిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మొదలైన ఫౌజీ మూవీ సంవత్సరన్నర కిందటే షూటింగ్ స్టార్ట్ అయింది.

ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ను గాని, గ్లింప్స్ ను గాని రిలీజ్ చేయలేదని అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అటు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాకి, ఇటు ప్రభాస్ ఫౌజీ సినిమా మధ్య ఏం జరుగుతుంది… ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు రిలీజ్ చేయడం లేదనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ సినిమాల మీద ప్రస్తుతానికి ఎలాంటి అంచనాలైతే లేవు. ఫ్యూచర్లో ఈ సినిమాకు సంబంధించి భారీ బజ్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం ప్రమోషన్స్ ను నెక్స్ట్ లెవెల్లో చేయాల్సిన అవసరమైతే ఉంది. ఈ సినిమాలకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ చేసి సినిమాల మీద హైప్ ను తారా స్థాయికి తీసుకెళ్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. తొందరగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే మంచిదని సినిమా విమర్శకులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version