Ram Charan Suggestions To Buchi Babu: కొన్ని సినిమాల విషయంలో దర్శకులు తీసుకునే నిర్ణయాలు సినిమా సక్సెస్ సాధించడానికి కారణం అవుతాయి. ఇక మరికొన్ని సినిమాల్లో హీరోలు చెప్పే సజెషన్లు కూడా సినిమా సక్సెస్ కి చాలా వరకు హెల్ప్ అవుతుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా విషయంలో రామ్ చరణ్ కొన్ని సజెషన్స్ అయితే చెప్పారట. ఆ సజెషన్స్ విషయంలో బుచ్చిబాబు కొన్ని పాటించాడు.
కొన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత ప్రతి సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంత పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదని కొన్ని సన్నివేశాలు తీసి పక్కన పెట్టేస్తే బాగుంటుందని సినిమా ఫ్లో కూడా సెట్ అవుతుందని చెప్పారట. కానీ బుచ్చిబాబు మాత్రం సినిమా చూడటానికి వచ్చే వాళ్లలో ఎక్కువ మంది బీ,సీ సెంటర్ ఆడియన్స్ ఉంటారు.
కాబట్టి జాన్వీ కపూర్ ఉంటేనే వాళ్ళు సినిమాని రిపీటెడ్ గా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తద్వారా కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ చెప్పిన మాటను పక్కనపెట్టి ఆమె సన్నివేశాలను ఎక్కువగానే ఉంచారట. దాంతో సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ ఎందుకు ఆమె సినిమాకి అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ చెప్పిన మాటే నిజమైంది అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు పెద్ది సినిమా సక్సెస్ ని సాధించింది అంటూ కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది. రామ్ చరణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ వీకెండ్ గడిస్తే గాని ఈ సినిమా జన్యూన్ టాక్ ఏంటి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ ను రాబట్టింది అనే విషయాల మీద సరైన క్లారిటి రాదు…
