Homeఅంతర్జాతీయంUS Congress Blocks Trump Military Action: ట్రంప్‌కు షాక్‌.. యుద్ధ స్పీడ్‌కు కాంగ్రెస్‌...

US Congress Blocks Trump Military Action: ట్రంప్‌కు షాక్‌.. యుద్ధ స్పీడ్‌కు కాంగ్రెస్‌ బ్రేక్‌!

US Congress Blocks Trump Military Action: పశ్చిమాసియాలో అగ్గి రాజేసి.. చివరకు ఇరాన్‌పై గెలవలేక చతిలికబడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో గట్టి షాక్‌ తగిలింది. విదేశాంగ విధానానికి ప్రతినిధుల సభ ట్రంప్‌ దూకుడుకు బ్రేక్‌ వేసింది. ఇరాన్‌తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు ఏకపక్షంగా సైనిక చర్యలు చేపట్టకుండా నియంత్రించే ‘వార్‌ పవర్స్‌’ తీర్మానాన్ని హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ 215–208 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఇది ట్రంప్‌ ప్రభుత్వం మీద కాంగ్రెస్‌ అసంతృప్తి ఎంత లోతుగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.

తీర్మానం ఎందుకు?
డెమోక్రటిక్‌ సభ్యుడు గ్రెగరీ మీక్స్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం, ఇరాన్‌పై యుద్ధం కొనసాగించాలంటే లేదా కొత్త సైనిక చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్‌ అనుమతి తప్పనిసరి. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం అధ్యక్షుడికి కాదు, కాంగ్రెస్‌కు చెందుతుందని ఇది మరోసారి గుర్తు చేస్తోంది. ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్‌ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరమైన అంశం. ఇది రిపబ్లికన్‌ పార్టీలోనే ట్రంప్‌ విధానాలపై అసంతృప్తి ఉందనడానికి నిదర్శనం.

ట్రంప్‌పై తిరుగుబాటు?
ఫిబ్రవరి చివరి నుంచి ఇరాన్‌తో ముదిరిన ఘర్షణల్లో ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే సైనిక చర్యలు చేపట్టిందని విమర్శలు ఎగసిపోతున్నాయి. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం, ఇంధన వ్యయాలు పెరగడం, ఆర్థిక భారం పెరగడం కారణంగా అమెరికా ప్రజాభిప్రాయం కూడా వ్యతిరేక దిశగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే డెమోక్రాట్లతోపాటు కొంతమంది రిపబ్లికన్లు కూడా కాంగ్రెస్‌ అధికారాలను బలపరిచే తీర్మానానికి మద్దతు ఇచ్చారు. గతంతో పోలికఇదే తరహా తీర్మానం మే నెలలో సభ ముందుకు వచ్చినప్పుడు 212–212తో సమం కావడంతో విఫలమైంది. కానీ ఈసారి అదనపు మద్దతు లభించడంతో హౌస్‌లో విజయం సాధించింది. ఇది ట్రంప్‌ వ్యతిరేక శక్తులకు ముఖ్యమైన రాజకీయ విజయం.

ఏం జరగబోతోంది?
హౌస్‌ ఆమోదించిన తీర్మానం ఇప్పుడు సెనెట్‌కు వెళ్తుంది. అక్కడ కూడా కొంతమంది రిపబ్లికన్ల మద్దతు ఉన్నప్పటికీ, తుది ఫలితం ఇంకా అనిశ్చితంగా ఉంది. సెనెట్‌ కూడా ఆమోదించినా, అధ్యక్షుడు ట్రంప్‌ వీటో విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యలు తక్షణం ఆగిపోవు. అయితే కాంగ్రెస్‌ అనుమతి లేకుండా యుద్ధం కొనసాగించడంపై ట్రంప్‌ ప్రభుత్వంపై రాజకీయ, రాజ్యాంగపరమైన ఒత్తిడి భారీగా పెరుగుతుంది.

ఇది కేవలం ఒక తీర్మానం ఆమోదం కాదు. అధ్యక్షుడి యుద్ధ అధికారాలపై కాంగ్రెస్‌ తన నియంత్రణను బలంగా పునరుద్ఘాటించిన ఘట్టం. ట్రంప్‌ దూకుడు విధానాలకు కొంత మేరకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు దీన్ని అభివర్ణిస్తున్నారు.ఈ తీర్మానం ట్రంప్‌ ప్రభుత్వం, కాంగ్రెస్‌ మధ్య అధికార పోరును మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సెనెట్‌ ఓటింగ్, ట్రంప్‌ వీటో నిర్ణయం అమెరికా రాజకీయాల్లో కీలక మలుపుగా నిలవనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version