Ram Charan Peddi Movie Analysis: రామ్ చరణ్ హీరోగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి క్రమం లోనే ఇవాళ్ళ రిలీజైన పెద్ది సినిమా విషయంలో కూడా చాలావరకు తను సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆయన ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకలోకాన్ని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మొదటి షో తోనే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన రావడం ఒకరకంగా మంచి పరిణామం అనే చెప్పాలి. అయితే పెద్ది సినిమా సూపర్ సక్సెస్ సాధించకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఈ సినిమాలో రెండు విషయాల్లో చాలా వరకు తప్పులు చేశారనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో లాజిక్స్ అయితే చాలా వరకు మిస్ అయ్యాయి. వాటి మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
ఒక దాంతో పాటుగా ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని అనవసరమైన సన్నివేశాలు కూడా ఈ సినిమాని బాగా ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. నిజానికి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు కొన్నిచోట్ల బోర్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ బోరింగ్ సన్నివేశాలన్నింటిని ఎడిటింగ్ లో తీసేసి ఉంటే బాగుండేది.
ముఖ్యంగా ఈ రెండు విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతానికి ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబడుతుంది. కాబట్టి మరో రెండు రోజులు గడిస్తే గాని ఈ సినిమా జన్యున్ ఏంటి అనేది తెలియదు.
కాబట్టి ఈ క్రమంలోనే ఈ సినిమా ఎంతవరకు వసూళ్లను రాబడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు రామ్ చరణ్ కెరియర్ లో ఒక్కటి కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసిన సినిమాలైతే లేవు. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుందనేది తెలియాల్సి ఉంది…
