Allu Arjun 50 crore fight sequence: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాతో అల్లు అర్జున్ భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియాలో ఈ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయగలుగుతుంది అనే కాన్ఫిడెంట్ తో అల్లు అర్జున్ ఐతే ఉన్నాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో అలీ అర్జున్ ఉన్నాడు. ఇక ఇంతకుముందు ఆయన షారుక్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. అయినప్పటికి ఆ సినిమా రొటీన్ కమర్షియల్ సినిమా లాగా నే ఉంది అంటూ కొన్ని విమర్శలను మూటగట్టుకుంది. దాంతో ఇప్పుడు విజువల్ వండర్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశ్యంతో అట్లీ డిఫరెంట్ సినిమానైతే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో అట్లీ ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. అల్లు అర్జున్ మరో మెట్టు పైకి ఎక్కుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఆయన సాధించబోయే విజయాలు వేరే రేంజ్ లో ఉండబోతున్నాయనే విషయాలైతే తెలుస్తున్నాయి. ‘పుష్ప 2’ మూవీతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు అట్లీ సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బ్రేక్ చేయగలుగుతుందా? లేదా అనే ఒక అంచనాలో తనున్నాడు.
అయితే ఈ సినిమా కోసం ఇప్పుడు 50 కోట్లు పెట్టి ఒక భారీ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాని ఒప్పుకోవడం అట్లీ ఈ సినిమాని అంతకు మించిన రేంజ్ లో తెరకెక్కించడం అన్ని తొందర తొందరగా జరిగిపోతున్నాయి. అంత బాగానే ఉంది కానీ అట్లీ ఈ మూవీతో అల్లు అర్జున్ నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
