Homeఅంతర్జాతీయంTrump new definition of ceasefire: సీజ్‌ఫైర్‌ అంటే యుద్ధం ఆపడం కాదట.. ట్రంప్‌ కొత్త...

Trump new definition of ceasefire: సీజ్‌ఫైర్‌ అంటే యుద్ధం ఆపడం కాదట.. ట్రంప్‌ కొత్త నిర్వచనం!

Trump new definition of ceasefire: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌–పాకిస్తాన్‌ మధ్య సీజ్‌ఫైర్‌ జరిగింది. దీంతో ఇరువైపులా యుద్ధం ఆగిపోయింది. కాంబోడియా, థాయ్‌లాండ్‌ మధ్య ఆలయం కోసం యుద్ధం జరిగింది. తర్వాత ఇరు దేశాల మధ్య సీజ్‌ఫైర్‌ కుదిరింది. యుద్ధం ఆగింది. తాజాగా అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధం జరిగింది. తర్వాత పాకిస్తాన్‌ చొరవతో సీజ్‌ఫైర్‌ కుదిరిందని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే సీజ్‌ఫైర్‌ అంటే యుద్ధం ఆపడం కాదట. కొత్త నిర్వచనం చెప్పి మళ్లీ ఒక్కసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. డొనాల్డ్‌ ట్రంప్‌. సీజ్‌ఫైర్‌(కాల్పుల విరమణ) అంటే యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, కేవలం తీవ్రత తగ్గుతుంది అని ట్రంప్‌ వెల్లడించారు. దీంతో ఆయన శాంతి భావనను తన స్వంత శైలిలో మార్చేశారు.

ట్రంప్‌ చెప్పిన కొత్త నిర్వచనం ఏమిటి?
ఇటీవలి ఇరాన్‌–ఇజ్రాయెల్‌–అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్‌ ఒక రిపోర్టర్‌ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇలా అన్నారు. ‘‘ఆ ప్రాంతంలో సీజ్‌ఫైర్‌ అంటే పూర్తి విరామం కాదు. అది తక్కువ తీవ్రతతో కాల్పులు జరపడం.’’ఈ ఒక్క వాక్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సంప్రదాయకంగా ‘సీజ్‌ఫైర్‌’ అంటే కాల్పులు పూర్తిగా ఆగిపోవడం, శాంతి చర్చలు మొదలవడం అని అర్థం. కానీ ట్రంప్‌ దానిని ‘‘నియంత్రిత యుద్ధం’’గా మార్చేశారు.

ట్రంపును ఆటాడుకుంటున్న నెటిజన్లు..
ట్రంప్‌ చెప్పిన కొత్త నిర్వచనం సోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు:‘‘ట్రంప్‌ ప్రకారం ప్రపంచంలో ఎక్కడా నిజమైన సీజ్‌ఫైర్‌ ఉండదు. రోజూ యుద్ధాలే ఉంటాయి, కేవలం తీవ్రత మారుతుంది.’’ అని కొందరు, ‘‘ఇకపై యుద్ధం అంటే ఏమిటి? సీజ్‌ఫైర్‌ అంటే ఏమిటి? రెండూ ఒకటే అని ట్రంప్‌ చెప్పేశారు.’’
‘‘శాంతి ప్రవచనాలు చేస్తూ యుద్ధాలు కొనసాగించడానికి కొత్త సాకు ఇచ్చారు.’’ అని మరికొందరు, కామెంట్‌ చేశారు.

ట్రంప్‌ వ్యాఖ్యల వెనుక రాజకీయం..
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల్లో ఒప్పందాలు జరిగినా, పూర్తి శాంతి సాధించడం చాలా కష్టం. రెండు వైపులా చిన్న చిన్న దాడులు, ఎదురుదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్‌ దీనిని ‘‘తక్కువ తీవ్రత యుద్ధం’’గా అభివర్ణించి, దీన్ని సాధారణీకరించారు. ఈ వాదనలో కొంత వాస్తవం ఉంది. అనేక యుద్ధాలు (ఉక్రెయిన్, గాజా, సిరియా మొదలైనవి) పూర్తి ఆగకుండా తక్కువ తీవ్రతలోనే కొనసాగుతున్నాయి. కానీ దీన్ని అధికారికంగా ‘‘సీజ్‌ఫైర్‌’’ అని పిలవడం శాంతి ఆశలను బలహీనపరుస్తుంది. ఇది యుద్ధాన్ని సాధారణీకరించి, శాంతిని అసాధ్యం చేసే లాజిక్‌గా కనిపిస్తోంది.

సీజ్‌ఫైర్‌ను ‘‘తక్కువ తీవ్రత యుద్ధం’’గా నిర్వచించడం ద్వారా యుద్ధం శాశ్వతం కావడానికి మార్గం సుగమం చేస్తున్నట్లు అనిపిస్తుంది. నిజమైన శాంతి అంటే కాల్పులు పూర్తిగా ఆగడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం. తక్కువ తీవ్రత కాల్పులు కేవలం ‘‘నియంత్రిత హింస’’ మాత్రమే. అది శాంతి కాదు. ట్రంప్‌ ఈ మాటలు చెప్పిన సమయం కూడా ముఖ్యం. ప్రపంచం ఇప్పటికే బహుళ యుద్ధాలతో అలసిపోయి ఉంది. ఇలాంటి సమయంలో నాయకులు శాంతికి కొత్త ఆశలు కల్పించాలి కానీ, కొత్త సాకులు ఇవ్వకూడదు. చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version