Rajamouli and Sandeep Reddy: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. చాలామంది దర్శకులు పాన్ ఇండియాలో సినిమాలు చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే సినిమాలను కూడా చేయగలుగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలందరు ఆయా దర్శకుల వెంటపడుతున్నారు. ఇండియాలో ప్రస్తుతం ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ లను పక్కన పెడితే ఇప్పుడు మరొక దర్శకుడు ఆ లిస్టులో చేరిపోయాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే ఆదిత్య ధర్ కావడం విశేషం… ఆయన చేసిన ‘దురంధర్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసింది. ఆయన చాలా తక్కువ రోజుల్లోనే బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చే సినిమాని చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అంటూ ప్రతి ఒక్కరు అతన్ని కొనియాడుతున్నారు.
ఇక రాజమౌళి సందీప్ రెడ్డి వంగ లను పక్కన పెట్టి మరి ఆదిత్య ధర్ చాలా గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధించారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన చేసిన ఈ రెండు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీ దశా దిశా ను కూడా మార్చాయి.
బాలీవుడ్ లో చాలా రోజుల నుంచి సక్సెసు లైతే రావడం లేదు. కానీ దురంధర్ రెండు పార్ట్ లతో భారీ విజయాన్ని అందించి బాలీవుడ్ స్థాయిని పెంచిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందంటే అక్కడున్న బాలీవుడ్ మాఫియా ఒప్పుకోవడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా అతను తన టాలెంట్ తో చాలావరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే పెను సంచలనాలను క్రియేట్ చేశాడనే చెప్పాలి…
ఇప్పటివరకు దర్శకులందరు వాళ్ల సత్తా ఏంటో చూపిస్తూ వచ్చారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం డిఫరెంట్ వే లో దేశం కోసం సినిమాలు చేసి పేక్షకులందరిని మెప్పించాడు… ఇక ఇప్పుడు అతనితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిని చూపిస్తుండటం విశేషం…
