Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్…ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టినవే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన ప్రతి సక్సెస్ అతన్ని చాలా ఉన్నతమైన స్థాయిలో నిలిపింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అనుకున్న విజయాన్ని సాధించలేకపోతున్నాడు… కారణం ఏదైనా కూడా తను మునుపటి ఫామ్ ని మాత్రం అందుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఉన్న హీరోలందరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో పూరి జగన్నాథ్ మాత్రం ఇంకా డీలా పడిపోవడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలోనే చాలా వరకు అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఆయన విజయ్ సేతుపతి తో కలిసి ‘స్లమ్ డాగ్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి ఆయన చాలా వరకు కష్టపడుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తను మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక పూరి జగన్నాథ్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ లో నీతులు చెప్పేవారు ఎక్కువయ్యారు. గానీ సరైన సమయానికి కష్టం వస్తే ఆదుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రారు అంటూ కొన్ని ఘాటు కామెంట్లు చేశాడు…
పోకిరి సినిమా తర్వాత తను పోగేసుకున్న డబ్బులు తన స్నేహితుడు తన దగ్గరి నుంచి అక్రమంగా దొబ్బేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ సమయంలో పూరి జగన్నాథ్ సైతం ఎక్కడ కూడా తను వెనక్కి అడుగు వేయకుండా ముందుకు సాగాడు. ఆ సమయంలో అతనికి తన భార్య అయిన లావణ్య మోరల్ సపోర్ట్ ఇచ్చిందట.
ఇప్పుడు నువ్వు జీరో నుంచి స్టార్ట్ చేయి మరోసారి విజయకేతనాన్ని ఎగరవేయొచ్చు అంటూ చెప్పిందట. అలాగే మంచి కథలు రాసుకోవడానికి కూడా చాలా వరకు హెల్ప్ ఫుల్ గా నిలిచిందని పూరి జగన్నాథ్ చెప్పాడు. ఇక ఇండస్ట్రీ వల్ల నుంచి ఏ సపోర్ట్ రాలేదని కూడా చెప్పాడు.
రామ్ గోపాల్ వర్మ ఒక్కడే బిజినెస్ మాన్ కథ కు సంబంధించిన ఒక ఐడియా అయితే ఇచ్చాడని దానివల్ల బిజినెస్ మాన్ లాంటి ఒక సూపర్ హిట్ సినిమా చేయగలిగాను అంటూ పూరి జగన్నాథ్ చెప్పడం విశేషం… ఇక ప్రస్తుతం మరోసారి తన హవా కొనసాగాలి అంటే ఇప్పుడు చేస్తున్న స్లమ్ డాగ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…
