spot_img
Homeజాతీయ వార్తలుVande Bharat Sleeper Train: పట్టాలెక్కిన మోదీ మరో కలల రైలు.. ప్రత్యేకతలు, చార్జీలు ఇలా..

Vande Bharat Sleeper Train: పట్టాలెక్కిన మోదీ మరో కలల రైలు.. ప్రత్యేకతలు, చార్జీలు ఇలా..

Vande Bharat Sleeper Train: కరోనా తర్వాత ప్రధాని నరేంద్రమోదీ మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత మే నెలలో నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఆత్మనిర్భర్‌ భారత్‌ను రక్షణ రంగానికి కూడా విస్తరించారు. సొంత ఆయుధాల తయారీపైనా దృష్టిపెట్టారు. ఇక మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా భారత రైల్వే ఇప్పటికే వందే భారత్‌ రైళ్లను పట్టాలెక్కించింది. ఇది ప్రధాని నరేంద్రమోదీ కల.. రెండేళ్లుగా వందేభారత్‌ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. తాజాగా మోదీ మరో కలల రైలు పట్టాలెక్కింది. వందే భారత్‌ స్లీపర్‌ను ప్రధాని శనివారం ప్రారంభించారు. పశ్చిమబెంగాల్‌లోని మాల్డా టౌన్‌ స్టేషన్‌ నుంచి మొదటి వందే భారత్‌ స్లీపర్‌ రైలును ప్రారంభించారు. కామాఖ్య–హౌరా మార్గంలో నడిచే ఈ రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందింది. మునుపటి వందే భారత్‌ రైళ్లు సీటింగ్‌ సౌకర్యాలు మాత్రమే అందించగా, ఇది స్లీపర్‌ క్లాస్‌తో రాత్రి ప్రయాణికులకు సౌకర్యం చేకూర్చింది.

టీ20 కాన్సెప్ట్‌తో..
2020లో టీ20 పేరుతో ప్రారంభించాలనుకున్న ఈ రైలు, కోవిడ్‌ వ్యాప్తి, టెక్నాలజీ ప్రయోగాల వల్ల ఆలస్యమైంది. చెన్నై ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) టీ18, టీ20 మోడల్స్‌ అభివృద్ధి చేసింది. 2019 ఫిబ్రవరి 15న మొదటి వందే భారత్‌ (డే ట్రైన్‌) ఢిల్లీ–వారణాసి మార్గంలో నడిచింది. ఇప్పుడు అస్సాం, పశ్చిమ బెంగాల్‌ను కలుపుతూ ఈ స్లీపర్‌ వెర్షన్‌ 958 కి.మీ. దూరం కవర్‌ చేస్తుంది.

ప్రత్యేకతలు ఇవీ..
రైలు డిజైన్‌ స్పీడ్‌ గంటకు 180 కి.మీ., 52 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగం అందుకుంటుంది. మార్గ సామర్థ్యం ఆధారంగా ఈ రైలు సగటు 65 కి.మీ./గం వేగంతో ప్రయాణిస్తుంది. మొదటి ప్రయాణం జనవరి 17 మధ్యాహ్నం 1:15 కామాఖ్య నుంచి బయలుదేరి తెల్లవారుజామున 3:55 హౌరా చేరుకుంటుంది. ఇది 3 గంటల సమయం ఆదా చేస్తుంది.

తొలి రైలు షెడ్యూల్‌ ఇలా..
వారానికి 6 రోజులు (బుధవారం మినహా) రెండు దిశల్లో నడుస్తుంది. కామాఖ్య–హౌరా మార్గంలో సాయంత్రం 6:15 బయలుదేరి తదుపరి రోజు ఉదయం 8:15 చేరుకుంటుంది. హౌరా–కామాఖ్య మార్గంలో గురువారం మినహా సాయంత్రం 6:20 బయలుదేరి తదుపరి రోజు ఉదయం 8:20 చేరుకుంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో జారీ అవుతుంది. 400 కి.మీ. పైగా దూరానికి మాత్రమే టికెట్‌ బుకింగ్‌ ఉంటుంది.

ఛార్జీలు, కోచ్‌ వివరాలు..
వందేభారత్‌ స్లీపర్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్‌ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. థర్డ్‌ ఏసీ (3–టైర్‌) చార్జీ రూ.2,999 + 5% జీఎస్‌టీ(సాధారణ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే రూ.1,000 ఎక్కువ). ఇక సెకండ్‌ ఏసీ (2–టైర్‌) చార్జీ రూ.2,970 + 5% జీఎస్టీ. ఫస్ట్‌ ఏసీ 24 బెర్తులు. ఉంటాయి. మొత్తం 16 కోచ్‌ల రైలులో 11 థర్డ్‌ ఏసీ, 4 సెకండ్‌ ఏసీ, 1 ఫస్ట్‌ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. మొత్తం 823 సీట్లు ఉంటాయి. ఆహారం కూడా అందించబడుతుంది.

టికెట్‌ బుకింగ్, క్లాస్‌ కోడ్‌లు
రైలు బయలుదేరడానికి 60 రోజుల ముందు ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్‌ బుక్‌ చేయవచ్చు. ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ (ప్రీమియం సీటింగ్‌). చైర్‌ కార్‌ (సాధారణ సీటింగ్‌), నో చాయిస్‌ (బెర్త్‌ ఎంపిక లేకుండా).

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. 2030 నాటికి 800, 2047 నాటికి 2,400 రైళ్లు లక్ష్యం. మొదటిది 2019లో దిల్లీ–వారణాసి మార్గంలో ప్రారంభమైంది. ఈ స్లీపర్‌ రైలు రైల్వేల అభివృద్ధికి మైలురాయి. దీనిని కూడా దేశవ్యాప్తంగా నడిపే ఆలోచనలో భారత రైల్వే ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version