TATA New Nano Car: ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలు వాడిన వారు కొన్ని అవసరాల నిమిత్తం ఫోర్ వీలర్ కొనాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఫోర్ వీలర్ కొనే ధరలోనే కారు కూడా వస్తే బాగుండు అనేవారు కూడా ఉంటారు. అలా బైక్ ధరలోనే వచ్చే కారును అందుబాటులోకి తీసుకొస్తుంది టాటా కంపెనీ. ఇప్పటికే లక్ష రూపాయల కారును తీసుకొచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు లేటెస్ట్ గా ఆ కారును అప్డేట్ చేసి నేటి తరానికి అవసరమయ్యే విధంగా మార్చి తక్కువ ధరలో అందిస్తోంది. అదే టాటా నానో. ఈ కారు భారతదేశంలోనే అత్యంత చౌకైన కారుగా పేర్కొనబడుతుంది. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
2026 కొత్త సంవత్సరం సందర్భంగా టాటా నానో కొత్త కారు రాబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటికే ఆన్లైన్లో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కారు ఫీచర్స్, ఇంజన్, ధర గురించి తెలిసి ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఈ కారు గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ కారుకు సంబంధించిన డిజైన్ విషయానికి వస్తే దీని ముందు LED రన్నింగ్ హెడ్ లాంప్స్ ఉండనున్నాయి. ఇవి నిరంతరం వెలుగుతుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. అలాగే ఈ కారుకు కొత్తగా డిజైన్ చేయబడిన గ్రిల్, బంపర్లు, సూక్ష్మ బాడీ లైన్లో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ డిజైన్ మొత్తం ప్రీమియం కారును పోలి ఉంటుంది. కాంపాక్ట్ కారు అయినప్పటికీ నగరాల్లో సులభంగా డ్రైవ్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది.
ఈ కారు ఇంటీరియర్ లో కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంటీరియల్ లో ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ తోపాటు మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. అలాగే డాష్ బోర్డు లేఅవుట్ కొత్తగా ఉండడంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో అమర్చబడిన సీట్లు కుశ నింగును అందిస్తాయి. దూరం ప్రయాణాలు చేసే వారికి లెగ్ స్పేస్ సౌకర్యవంతంగా ఉంటుంది. రోజువారి ప్రయాణికులకు ఎలాంటి అలసట లేకుండా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారుకు కిటికీలను పెద్ద సైజులో అమర్చడంతో వెంటిలేషన్ కు ఏమాత్రం డోకా ఉండాలని చెప్పవచ్చు..
ఈ కొత్త కారులో డిజైన్ ను కూడా అప్డేట్ చేశారు. పెట్రోల్ ఇంజన్ తో నడిచే ఈ కారు లీటర్ ఇంధనానికి 30 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. రోజువారి వినియోగదారులకు.. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఇక ఈ కారులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, EBD టెక్నాలజీ, సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి సేఫ్టీన్ ఇస్తాయి. ఇది మార్కెట్లోకి వస్తే రూ. 2 లక్షల కే సొంతం చేసుకోవచ్చు అన్న చర్చ సాగుతోంది.
