Euphoria Trailer: గుణ శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యుఫోరియా సినిమా ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని గత కొద్దిసేపటికి క్రితమే రిలీజ్ చేశారు… ఈ సినిమా ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూత్ డ్రగ్స్ కి ఎలా బానిసలు అవుతున్నారు. మద్యం తాగి డ్రగ్స్ తీసుకొని ఆ మత్తులో వాళ్ళు ఎలాంటి క్రైమ్ చేస్తున్నారు అనే విషయాలను ఈ సినిమాలో ప్రధాన అంశంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు…ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక ఈ సినిమాలో కీలక పాత్ర వహిస్తున్నట్టుగా తెలుస్తోంది… గౌతమ్ మీనన్ సైతం ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక పోక్స్ చట్టం గురించి ఈ సినిమాలో చర్చించబోతున్నట్టుగా ట్రైలర్ లో రివిల్ చేశారు. ఇక ఈ విషయాన్ని చాలా డీప్ గా డిస్కస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక ట్రైలర్ లో ఈ పాయింట్ హైలెట్ అయింది… మొత్తానికైతే ఈ సినిమా యూత్ ను బేస్ చేసుకొని మాత్రమే చేశారు. అలాగే యూత్ ఎలా ఉంటే బాగుంటారు అనే విధంగా కూడా ఇందులో ఒక మంచి మెసేజ్ ని కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ట్రైలర్ లో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ గురించి కూడా డిస్కషన్ చేశారు….
ట్రైలర్ లో చూపించిన విజువల్స్ సైతం చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. కాల భైరవ అందించిన సినిమాకి ప్లస్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే గుణశేఖర్ లాంటి ఒక దర్శకుడు నుంచి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
ఎప్పటికప్పుడు సినిమాల విషయంలో అప్డేట్ అవుతానని చెబుతూ ఉండే గుణశేఖర్ మరోసారి యూత్ ను టార్గెట్ చేసి రాసుకున్న కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ట్రైలర్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. ఇక సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది… ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే గుణశేఖర్ మరోసారి లైన్ లైట్ లోకి వస్తాడు. స్టార్ హీరోలను సైతం డైరెక్షన్ చేసే స్థాయికి వెళ్ళిపోతాడు. లేకపోతే ఆయన డీలా పడిపోయే పరిస్థితి రావచ్చు…
