Pradeep Ranganathan Replacing Vijay in Tamil Nadu: తమిళనాడు లో సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలు అజిత్(Thala Ajith) , విజయ్(Thalapathy Vijay). దాదాపుగా 15 ఏళ్ళ నుండి వీళ్లిద్దరి రాజ్యమే తమిళనాడు లో నడుస్తూ వస్తోంది. అయితే విజయ్ రీసెంట్ గానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక మీదట సినిమాలు చేయబోనని స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ ‘జన నాయగన్’ చిత్రం మేకర్స్ పూర్తి స్థాయిలో నష్టాల్లో ఉన్నారు కాబట్టి , వాళ్ళ కోసం ఒక్క సినిమా ఉచితంగా చేస్తానని మాట ఇచ్చాడు. ఈ ఒక్క సినిమా మినహా, భవిష్యత్తులో ఆయన మరో సినిమా చేసే అవకాశం లేదు. ఇక అజిత్ విషయానికి వస్తే, ఈయన సినిమాలు చేస్తున్నాడు కానీ, ఆయన పూర్తి ఫోకస్ మొత్తం ఇప్పుడు కార్ రేసింగ్ మీదకు మరలింది. సినిమాలు కేవలం పార్ట్ టైం జాబ్ లాగా చూస్తున్నాడు.
ఆయన నుండి భారీ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి కూడా చాలా కాలమే అయ్యింది. ఇలాంటి సమయం లో ఇప్పుడు తమిళనాడు లో మరో హీరో స్టార్ అయ్యేందుకు భారీ స్పేస్ దొరికింది. అందరూ ఈ స్పేస్ ని శివ కార్తికేయన్ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకొని , విజయ్ , అజిత్ రేంజ్ సూపర్ స్టార్ అయిపోతాడని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ఇప్పుడు విజయ్ స్థానాన్ని కబ్జా చేస్తున్నాడని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఎక్కడ చూసిన తమిళ మీడియా లో దీని గురించే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇతను తీసే ప్రతీ సినిమా జెన్ జీ ఆడియన్స్ ని అలరించే విధంగా ఉన్నాయి. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ చిత్రాలు ఒక దానిని మించి ఒకటి ఎలాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి మన అందరికీ తెలిసిందే.
తమిళనాడు లో విక్రమ్ , సూర్య వంటి హీరోలు కూడా వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఈ యువ హీరో మొదటి మూడు సినిమాలతో వంద కోట్ల గ్రాస్ ని అవలీలగా కొల్లగొట్టడం తమిళనాడు ఇండస్ట్రీ లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. ఇక రీసెంట్ గా ee యువ హీరో నుండి విడుదలైన ‘LIK’ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకంటూ ముందుకు దూసుకుపోతుంది. దీనిని బట్టీ చూస్తుంటే, విజయ్ స్థానాన్ని ప్రదీప్ రంగనాథన్ చిన్నగా ఆక్రమిస్తూ ముందుకు వెళ్తున్నాడని , ఇంకో రెండు భారీ హిట్స్ పడితే తమిళనాడు లో బిగ్గెస్ సూపర్ స్టార్ అయిపోతాడని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
