Mythri Movie Makers: స్టార్ హీరోలతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ , ఇండియా లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్ గా పేరొందిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ ఫిలిం ఛాంబర్ లో ‘దొంగ నా కొడుకు’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న మౌళి ఈ చిత్రం లో హీరో గా నటించబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా శ్రీను అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు. కొత్త కొత్త ఆలోచనలతో కంటెంట్ క్రియేట్ చేసే మౌళి, తన ప్రతీ సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. అందులో భాగాంగానే ఈ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ టైటిల్ ని చూసిన తర్వాత ఇదేమి టైటిల్ రా బాబు అని మీరంతా నవ్వుకోవచ్చు. అంతే కాకుండా ఎన్నో సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుండి ఇలాంటి సినిమా రాబోతుండడం ఏంటి?, చాలా విచిత్రంగా ఉండే అని మీకు అనిపించొచ్చు, కానీ ఈ టైటిల్ జనాల్లోకి మాస్ గా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా, అందరి దృష్టిని కూడా ఈ సినిమాపై కేంద్రీకృతం అయ్యేలా చేసింది ఈ టైటిల్. అంతే కాకుండా, ఈ చిత్రం స్క్రిప్ట్ ఆరంభం నుండి , ఎండింగ్ వరకు థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుందట . ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరు , మిగిలిన నటీనటుల వివరాలేంటి , సంగీత దర్శకుడిగా ఎవరు వ్యవహరించబోతున్నారు? వంటివి తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ‘లిటిల్ హార్ట్స్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో , దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి.
