Director Maruthi: కామెడీ జానర్ లో మంచి కమర్షియల్ విజయాలను సొంతం చేసుకున్న దర్శకులలో ఒకరు మారుతి. ఈరోజుల్లో చిత్రం తో ఆయన కెరీర్ మొదలైంది. మొదటి సినిమానే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో , మారుతి కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కట్టాయి. ఆ తర్వాత ఆయన చేసిన ‘బస్సు స్టాప్’, ‘కొత్త జంట’, ‘భలే భలే మొగాడివోయ్’ , ‘ప్రతి రోజు పండగే’ వంటి చిత్రాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో మారుతి టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ లో ఆయనకు మరో లెవెల్ కి వెళ్లే అద్భుతమైన అవకాశం ‘ది రాజా సాబ్’ చిత్రం ద్వారా వచ్చింది. ఈ చిత్రానికి ముందు గోపీచంద్ తో ఆయన చేసిన ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రం ఘోరమైన ఫ్లాప్ గా మిగిలినప్పటికీ, ప్రభాస్ పెద్ద మనసు చేసుకొని అవకాశం ఇచ్చాడు.
ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికినప్పుడు ఏ డైరెక్టర్ అయినా చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటాడు. కానీ మారుతీ మాత్రం వినియోగించుకోలేదు. ప్రభాస్ కి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందించాడు. ఎదో కొత్తగా తీసే ప్రయత్నం చేసి , చేతులు కాల్చుకున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చినప్పుడు , ఆయన కెరీర్ వేరే లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఏ రేంజ్ లో ఉన్నాయో , తేడా జరిగితే పాతాళలోకంలో పడిపోయే అవకాశాలు కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయని విశ్లేషకులు ముందుగానే ఊహించారు. వాళ్ళు ఊహించినట్టుగానే జరిగింది. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత మారుతి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ప్రస్తుతం ఆయన ‘హ్యాపీ పొంగల్’ అనే స్క్రిప్ట్ ని రెడీ చేసాడు. కేవలం 40 రోజుల్లోనే పూర్తి చెయ్యాలనేది టార్గెట్.
అయితే ఈ సినిమాలో నటించేందుకు ఒక్క హీరో కూడా ఆసక్తి చూపించడం లేదు. ముందుగా సాయి ధరమ్ తేజ్ తో చెయ్యాలని అనుకున్నాడు. కానీ సాయి ధరమ్ తేజ్ డేట్స్ ఖాళీ లేవని తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోలకు కూడా ఆయన ఈ సినిమా స్టోరీ ని వినిపించాడు . వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. చివరికి రీసెంట్ గానే సంగీత్ శోభన్ కి ఈ సినిమా కథ ని వినిపించడానికి వెళ్ళాడట మారుతీ. ఈయన అయితే కనీసం స్టోరీ ని వినడానికి కూడా ఆసక్తి చూపలేదట. తర్వాత చూద్దాం సార్ అని చెప్పి వెనక్కి పంపేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మినిమం గ్యారంటీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతీ పరిస్థితి ఇప్పుడు ఎలా అయ్యిందో మీరే చూడండి. మరి ఈయనకు భవిష్యత్తులో అవకాశం ఇచ్చే డైరెక్టర్ ఎవరో చూడాలి.
