spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Panjaa re release : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి డిజాస్టర్ సినిమా...

Pawan Kalyan Panjaa re release : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి డిజాస్టర్ సినిమా రీ రిలీజ్.. సరికొత్త ప్రయోగం చేయనున్న ఫ్యాన్స్..

కొన్ని సినిమాలు అప్పటి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా లేకపోవడం ఫ్లాప్స్ అయ్యాయి కానీ , అవే సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన పాజిటివ్ ఫలితాన్ని సొంతం చేసుకోవడం మన కళ్లారా చూసాము. అందుకు బెస్ట్ ఉదాహరణ ‘ఖలేజా’, ‘ఆరెంజ్’ చిత్రాలు. మహేష్ బాబు , రామ్ చరణ్ కెరీర్స్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా పిలవబడే ఈ రెండు చిత్రాలు , రీ రిలీజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా అప్పట్లో ఫ్లాప్ అయ్యే సినిమాలకు , నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి పంజా. ఆరోజుల్లో కొమరం పులి, తీన్ మార్ వంటి వరుస పరాజయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ మామూలుది కాదు.

కనీవినీ ఎరుగని భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అందుకు కారణం ఈ సినిమా బాలు చిత్రం తో పోలి ఉండడం ఒకటి అయితే, బలహీనమైన సెకండ్ హాఫ్ మరో కారణంగా చెప్పుకోవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ ఈ సినిమా నేటి తరం జెన్ జీ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో నచ్చేసింది. ఎప్పటి నుండో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యమని మేకర్స్ ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ చిత్రాన్ని లేటెస్ట్ 4K టెక్నాలజీ మార్చి , సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయబోతున్నారు అట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

‘ఓజీ’ చిత్రాన్ని చూసిన తర్వాత జెన్ జీ ఆడియన్స్ ‘పంజా’ రీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హాలీవుడ్ యాక్షన్ హీరోలాగా , చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. మంచి పాటలు ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ లో ఉంటుంది. అదే విధంగా సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు పవన్ కళ్యాణ్ ని యాక్షన్ మోడ్ లో చూడడం అభిమానులకు నిజంగా విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి ‘గబ్బర్ సింగ్’ చిత్రం తర్వాత కొత్త తరం ఫ్యాన్ బేస్ ఒక రేంజ్ లో ఏర్పడింది. ఇక ‘ఓజీ ‘ తర్వాత జెన్ జీ ఆడియన్స్ ఫ్యాన్ బేస్ కూడా తోడు అయ్యింది. ఈ రెండు తరాలకు చెందిన వాళ్ళు బలంగా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి, కచ్చితంగా ఈ చిత్రం రీ రిలీజ్ లో సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version