Harish Shankar next movie : బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా, ఒక ఛత్రం లో చిక్కుకొని , కాలానికి తగ్గట్టుగా అప్డేట్ అవ్వకుండా, ఫేడ్ అవుట్ అయిపోయిన స్టార్ డైరెక్టర్స్ మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి డైరెక్టర్స్ లో లిస్ట్ లోకి ఇప్పుడు హరీష్ శంకర్ కూడా చేరిపోయాడు. ఈయన ఫిల్మో గ్రఫీ ని చూస్తే చాలా బాగానే ఉంటుంది. షాక్ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్ ని తెచ్చుకున్నాయి. ఆ తర్వాత విడుదలైన మిరపకాయ్ , గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్నాడు. కానీ ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత జెన్ జీ ఆడియన్స్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారిపోయాడు. ఎందుకంటే ఆయన ఆలోచనలు 2012 దగ్గరే ఆగిపోయాయి.
హిందీ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘ది రైడ్’ వంటి క్లాసిక్ చిత్రానికి, కామెరికాల్ ఎలెమెంట్స్ జోడించి , ‘మిస్టర్ బచ్చన్’ గా రీమేక్ చేసి అబాసుపాలయ్యాడు. ఇక అక్కడితో సరిపోదు అన్నట్టు , ఎప్పుడో పదేళ్ల క్రితం విడుదలైన తమిళ చిత్రం ‘తేరి ‘ స్టోరీ లైన్ కి , మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా రీమేక్ చేసి రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వదిలాడు . ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘ఓజీ’ లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా తీసిన తర్వాత కూడా, ఇలాంటి పాత కాలపు కమర్షియల్ సినిమాలను జనాలు చూడరు అనే విషయాన్నీ అంగీకరించడం లేదు హరీష్ శంకర్. పైగా రీమేక్ ప్రచారం ఈ సినిమా కొంప ముంచింది.
ఈ చిత్రం లో హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్ ని చూసి ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు , కొత్త హీరోలు కూడా ఆయనతో సినిమా చెయ్యాలంటే భయపడుతున్నారు. ఇకపోతే హరీష్ శంకర్ ప్రస్తుతం రెండు ప్రొడక్షన్ హౌస్ల నుండి అడ్వాన్స్ లు అందుకున్నాడు. అందులో ఒకటి KVN ప్రొడక్షన్స్ కాగా, మరొకటి సితార ఎంటర్టైన్మెంట్స్. KVN సంస్థ ఇప్పట్లో సినిమాలు నిర్మించలేనంత అప్పుల్లోకి కూరుకుపోయింది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నే హరీష్ శంకర్ తో సినిమా చెయ్యాలి. ముందుగా బాలయ్య తో చెయ్యాలని అనుకున్నారు కానీ, ఉస్తాద్ ఫలితం చూశాక , ఆయన హరీష్ తో పని చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఇప్పుడు నితిన్ వైపు హరీష్ శంకర్ ద్రుష్టి మరలింది. రీసెంట్ గానే నాగవంశీ తో కలిసి నితిన్ ఇంటికి వెళ్లి ఒక స్టోరీ లైన్ వినిపించాడట. అది నితిన్ కి కూడా బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయినట్టు తెలుస్తోంది. కనీసం ఈ సినిమా తో అయినా హరీష్ శంకర్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
