Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ నుండి సరైన సినిమా పడబోతోంది, ఇక మెగా ఫ్యాన్స్ కి పండగే, మరో రంగస్థలం లాంటి సినిమా రాబోతుంది అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ చిత్రం నుండి ఈ కంటెంట్ విడుదలైనా అది వేరే లెవెల్ లో వెళుతోంది. రీసెంట్ గానే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. దానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూసాము. సినిమా కంటెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అని చెప్పడానికి ఇంతకు మించి ఏమి కావాలి. అంత బాగానే ఉంది కానీ, ఈ సినిమా విడుదల తేదీ విషయం లో మేకర్స్ చేస్తున్న పొరపాటు కారణంగా ఈ సినిమా మీదున్న హైప్ బాగా తగ్గించే సూచనలు కలిగిస్తున్నాయి.
ముందుగా రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో ఏప్రిల్ 30 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా ఈ సినిమా రావడం లేదు. పోనీ కనీసం పక్క నెల మే లో వస్తుందా అంటే అది కూడా లేదు. జూన్ 25 న విడుదల చేస్తారట. అంటే దాదాపుగా రెండు నెలల పాటు వాయిదా పడబోతోంది అన్నమాట ఈ చిత్రం. ఇది అభిమానులకు తీవ్రమైన కోపాన్ని కలిగించేలా చేస్తోంది. మే 21 న విడుదల చేస్తే బాగుండును అని అభిమానులు చాలా ఆశపడ్డారు. కానీ చివరికి జూన్ 25 న విడుదల అనేలోపు అభిమానుల్లో ఉత్సాహం పూర్తిగా సన్నగిల్లింది.
ఎందుకంటే సమ్మర్ చివరి దశలో ఉన్న తేదీ కాబట్టే అభిమానుల్లో ఆ నిరుత్సాహం. పైగా అదే రోజున 5 పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా విడుదల అవ్వబోతున్నాయి అట. అందులో స్పైడర్ మ్యాన్ వంటి భారీ క్రేజ్ ఉంది. ఇలాంటి సమయం లో నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి థియేటర్స్ దొరకడం చాలా కష్టం అయిపోతుంది. 2 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ కూడా రావడం కష్టమే ఇప్పుడు. కనీసం 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా కష్టమని అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో షోస్ బాగా తగ్గిపోయే అవకాశం ఉందట. ఇలా అయితే ఇక రికార్డ్స్ కష్టమే అని అంటున్నారు ఫ్యాన్స్.