Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Ram Charan Childhood Story: రామ్ చరణ్ ను మొత్తం మూడుసార్లు కొట్టిన...

Pawan Kalyan Ram Charan Childhood Story: రామ్ చరణ్ ను మొత్తం మూడుసార్లు కొట్టిన పవన్ కళ్యాణ్…రీసెంట్ గా ఒకసారి…

Pawan Kalyan Ram Charan Childhood Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది హీరోల్లో మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు ఆరుగురు హీరోలుండటం విశేషం…ఇక వారి నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులు విశేషంగా అలరిస్తుంటాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాలు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం గత 35 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తనదైన రీతిలో క్రేజ్ ను సంపాదించుకున్నాడు… ఇక చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ సైతం మెగా పవర్ స్టార్ గా అవతరించాడు. రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య చాలా మంచి బాండింగ్ ఉందని వాళ్ళిద్దరు పలు సందర్భాల్లో తెలియజేశారు. నిజానికి చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ కి ఏ ప్రాబ్లం ఉన్న పవన్ కళ్యాణ్ తో చెప్పేవారట.

ఇక చిన్నతనంలో రామ్ చరణ్ సరిగ్గా చదవకపోయిన ఏదైనా తప్పు పనులు చేసిన కూడా పవన్ కళ్యాణ్ మందలించే వాడట. ఇక రామ్ చరణ్ తన చిన్నతనంలో స్కూల్లో తన ఫ్రెండ్ ను కొట్టాడట. దాంతో ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మీద సీరియస్ అయి అతని మీద చేయి చేసుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి…

ఇక ఇప్పటికి రామ్ చరణ్ ఏదైనా చిలిపి పనులు చేస్తుంటే అది పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన ప్రతి సారి ఆయన నెత్తి మీద రెండు మెట్టికాయలు వేస్తూ ఉంటారట. మొత్తానికైతే ఆ పనుల వల్ల వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ సెట్ అయిందట. నిజానికి రామ్ చరణ్ కి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం…

చిరంజీవి కి చెప్పలేని కొన్ని విషయాలను పవన్ కళ్యాణ్ తో చెప్పుకుంటాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్ నెస్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక చిన్నతనంలో రామ్ చరణ్ ను పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉండి చూసుకునేవారట… కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అలా మంచి బాండింగ్ కుదిరిందని గతంలో పలు సందర్భాల్లో అటు పవన్ కళ్యాణ్ ఇటు రామ్ చరణ్ చెబుతుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular