Dhurandhar 3: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. డిఫరెంట్ సినిమాలు చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వైవిధ్యభరితమైన సినిమాలను చూడడానికి ప్రేక్షకులు సైతం ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అందువల్లే డిఫరెంట్ మేకింగ్ తో గాని, కథ తో గాని వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక దురంధర్, దురంధర్ 2 రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక ఇప్పుడు దురంధర్ 3 కూడా ఉండబోతుంది అంటూ దర్శకుడు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దురంధర్ 3 కథ ఏంటి అంటే మరోసారి హంజా రా ఏజెంట్ గా నటించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే మళ్ళీ పాకిస్తాన్ కి వెళ్తాడా, లేదంటే ఇతర దేశాలకు ఆయనను పంపించబోతున్నారా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
మొత్తానికైతే రెండు పార్ట్ లతో ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసిన ఆదిత్యధర్ మరోసారి మూడో పార్ట్ ను కూడా చేసి సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ మూవీ తో ఆదిత్య ధర్ కి మంచి క్రేజ్ దక్కింది. ఆయన సినిమాలో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తుండటం విశేషం…
ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేసిన ఈ దర్శకుడు ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. దురంధర్ సిరీస్ ని పక్కన పెడితే తన నుంచి రాబోయే సినిమాలు ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి సైతం ఇండియన్ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక తర్వాత చేయబోయే సినిమాల విషయంలో కూడా ఆయన పూర్తి క్లారిటితో ఉంటున్నాడట…
దురంధర్ 3 రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఆయన మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఆ హీరో ఎవరు అనేది ఇంకా క్లారిటి రాలేదు…తొందర్లోనే తన తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు…