Top 5 air conditioners under 35000: వేసవి తాపం పెరిగిపోవడంతో ప్రజలు చల్లదనం కోరుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 40 డిగ్రీల చేరువలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో ఎండ వేడి నుంచి తగ్గించుకునేందుకు ఫ్యాన్ల స్పీడు పెంచుతున్నారు. అటుకు మీద ఉన్న కూలర్లను దించుతున్నారు. అయితే కొంతమంది కాస్త డబ్బు వెచ్చించి Air Conditioner (AC) కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇందులోను కూడా లో బడ్జెట్ ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు తక్కువ ధరకే ఏసీలను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. వీటిలో 1.5 టన్ ఏసీ కోసం చూసేవారికి రూ. 35 వేల లోపు అద్భుతమైన ఏసీలు ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఎయిర్ కండిషనర్ రూ. 40 వేల తో విక్రయిస్తూ ఉంటారు. కెపాసిటీని బట్టి ధర పెరుగుతూనే ఉంటుంది. కానీ కొత్తగా ఏసీ కొనే వారితోపాటు మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం 1.5 టన్ ఏసీలు రూ. 35000 లోపే అందుబాటులో ఉన్నాయి. వీటిలో వోల్టాస్ కంపెనీకి చెందిన 1.5 టన్ 3 స్టార్ ఏసీ ని రూ. 31,490 తో విక్రయిస్తున్నారు. ఇది ఫోర్ ఇన్ వన్ అడ్జస్టబుల్ కూలింగ్ సిస్టంను అందిస్తుంది. ఐదు సంవత్సరాల వరకు దీనికి వారంటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. Haier కంపెనీకి చెందిన 1.5 టన్ 3 స్టార్ ఏసీ ని రూ.33,990 తో విక్రయిస్తున్నారు. ఇందులో ట్రిపుల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటుంది. 7 in 1 ఇంటెల్లి convertibles మోడ్ విద్యుత్ వినియోగాన్ని ఆదా చేస్తుంది.
క్యారియర్ అనే కంపెనీకి చెందిన 1.5 టన్ ఎయిర్ కండిషనర్ ను రూ.33,990 తో విక్రయిస్తున్నారు. ఇందులో రెండు రకాల బ్యాటరీలు ఉంటాయి.4800 W కూలింగ్ సామర్థ్యం ఉన్న AI ఇన్వర్టర్ టెక్నాలజీ అందిస్తుంది. గోద్రెజ్ కంపెనీకి చెందిన 1.5 టన్ త్రీ స్టార్ ఏసీ ని రూ.29,490 తో విక్రయిస్తున్నారు. 230 వోల్ట్ పవర్ సప్లై అందించే ఇది 1003 యూనిట్ల విద్యుత్ వినియోగాన్ని ఆదాచేస్తుంది. డైకిన్ అనే కంపెనీకి చెందిన 1.5 టన్ 3 స్టార్ ఎసిని రూ.32,490 తో రిప్లై ఇస్తున్నారు. ఇందులో కాపర్ కండెన్సర్ ఉండడం వల్ల కూలింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆన్లైన్లో లేదా బ్యాంకు క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.