Homeఎంటర్టైన్మెంట్Jr NTR friendship controversy: జూనియర్ ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా ప్రమాదకరం...నటుడి ఆవేదన...

Jr NTR friendship controversy: జూనియర్ ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా ప్రమాదకరం…నటుడి ఆవేదన…

Jr NTR friendship controversy: కొంతమంది హీరోలు యాక్టింగ్ చేస్తుంటే అసలు చూడలేము. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి పాత్రలోనైనా సరే అలవోకగా నటించి మెప్పించగలుగుతాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియాలో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. గతంలో ఆయన చేసిన దేవర, […]

Jr NTR friendship controversy: కొంతమంది హీరోలు యాక్టింగ్ చేస్తుంటే అసలు చూడలేము. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి పాత్రలోనైనా సరే అలవోకగా నటించి మెప్పించగలుగుతాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కారణం ఏంటి అంటే తన తోటి హీరోలందరు పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియాలో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. గతంలో ఆయన చేసిన దేవర, వార్ 2 లాంటి సినిమాలు అతనికి ఏ మాత్రం ఇమేజ్ ను ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాననే ఒక ధృడ సంకల్పం తో ముందుకు సాగుతున్నాడు. ఆయన చేసిన సినిమాల విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నప్పటికి ఎక్కడో ఏదో చిన్న తేడా జరుగుతుండటం వల్ల ఆయనకి రావాల్సిన సక్సెస్ రావడం లేదు… ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం చేయడం చాలా ప్రమాదకరం అంటూ ఒక నటుడు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నాడు.

ఇంతకీ ఆయన ఎవరు అంటే రాజీవ్ కనకాల కావడం విశేషం. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా చేస్తున్న సమయంలో రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ ఫ్రెండ్షిప్ తోనే ఎన్టీఆర్ రాజీవ్ ను చాలా సార్లు ఆడుకునేవాడట. తనకి ఏదైనా పని ఉంటే చాలు అవతలి వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళను తనతో పాటు తీసుకెళ్తాడు.

Also Read: ‘కాంతారా’ టీంని ఇన్ స్టాగ్రామ్ లో ‘Unfollow’ కొట్టిన రిషబ్ శెట్టి.. అసలు ఏమి జరుగుతోంది..

అలాగే ఎనీ టైం ఫోన్ చేసి ఏదొక విషయాన్ని చెబుతూ ఉంటాడట. మరి అవతల వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నా లేకపోయినా తను అనుకున్నది చేసే రకం అంటు రాజీవ్ కనకాల పలు సందర్భాల్లో ఎన్టీఆర్ గురించి ఆసక్తికరంగా వివరించాడు.

అయితే స్టూడెంట్ నెంబర్ వన్ టైమ్ లో తను ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి అలా బిహేవ్ చేసేవాడు కానీ తర్వాత చాలా మెచ్యుర్డ్ గా వ్యవహరిస్తున్నాడు అంటూ చెప్పాడు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ స్నేహం కోసం ప్రాణం ఇస్తాడు అంటూ తన గురించి గొప్ప గా చెప్పడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper