Suzuki Jimny offroad features: భారత్లో కార్లు కొనాలని అనుకునేవారు ఎక్కువగా SUV సెగ్మెంట్ టు పై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో విశాలమైన స్పేస్ ఉండడంతో ఇంజన్ పనితీరు కూడా మెరుగ్గా ఉండడంతో చాలామంది ఈ రకమైన కార్ల కొనుగోలు చేస్తుంటారు. అయితే మారుతి సుజుకి కంపెనీకి చెందిన Jimmy ప్రత్యేకంగా నిలుస్తోందన్న చర్చ సాగుతోంది. అయితే ఇది గతంలో కంటే ఇప్పుడు అప్డేట్ చేసుకొని మార్కెట్లోకి వచ్చింది. దీంతో దీని ధరలు కూడా మారిపోయాయి. అలాగే ఫీచర్లు కూడా నేటి తరం వారికి అనుగుణంగా ఉండడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. మరి మార్కెట్లో కొత్తగా ఉన్న జిమ్మీ ఎలాంటి ఫీచర్లతో ఆకట్టుకోబోతుందో చూద్దాం..
2026 కొత్త సంవత్సరం సందర్భంగా అప్డేట్ చేసుకున్న మారుతి సుజుకి జిమ్మీ ఇంజన్ వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉంది. ఇందులో 1.5 లీటర్ k 15 B పెట్రోల్ ఇంజన్ ఉండగా ఉంది. ఇది 104.8 హార్స్ పవర్ తో పాటు 134.2nm టార్కును రిలీజ్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 16 నుంచి 17 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఎలాంటి రోడ్లపైనైనా సులభంగా ప్రయాణించేలా దీనికి లాడర్ ఫ్రేమ్ చాసిస్ తో పాటు సస్పెన్షన్ సిస్టం బలంగా ఉంటుంది.
ఈ కారు ఇన్నర్ లో కొత్త స్మార్ట్ ఫీచర్లను చూడొచ్చు. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ పంటి ఫీచర్లతో పాటు ఎక్స్టీరియర్ డిజైన్ లో భాగంగా ఎల్ఈడి హెడ్ లాంప్స్, స్టైలిష్ అలాయ్ వీల్స్, ఎత్తయిన గ్రౌండ్ క్లియరెన్స్ వంటివి కారుకు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో సేఫ్టీ ఫీచర్లు కూడా ప్రత్యేకంగా చూడవచ్చు. కారు మొత్తంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వీటితోపాటు హిల్ హోల్డ్ అసిస్ట్, ABS+EBD, బ్రేకింగ్ సిస్టం లో భాగంగా ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ సేఫ్టీని అందిస్తాయి. నగర వీధులతోపాటు పర్వత ప్రాంతాల్లో కూడా ఎలాంటి అలజడి లేకుండా సులభంగా ప్రయాణం చేయడానికి దీనికి ఉండే టైర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే మారుతి సుజుకి జిమ్మీ మొత్తం 4 వేరియెంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో Jeta Pro వేరియంట్ ను రూ.12.31 లక్షలతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.14.44 లక్షలు గా ఉంది.