Pawan Kalyan Emotional Speech: మరో మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నిన్న ఆ చిత్రం మేకర్స్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి అభిమానులు వేల సంఖ్యలో హాజరు కాగా, పవన్ కళ్యాణ్ స్పీచ్ అభిమానుల్లో కొత్త ఉల్లాసాన్ని నింపింది. సినిమా మీద కావాల్సినంత బజ్ ఏర్పడలేదు అంటూ అభిమానుల్లో ఏర్పడిన భయాన్ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తుడిచిపెట్టేసింది. ఈ ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పెరిగాయి. పవన్ కళ్యాణ్ రంగం లోకి దిగితే ఎలాంటి రొటీన్ కమర్షియల్ సినిమా చేసినా వేరే లెవెల్ కి వెళ్తుంది అని చెప్పడానికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక ఉదాహరణగా నిల్చింది.
ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ప్రసంగం లోని హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘సాధారణంగా నేను నా సినిమాల గురించి గొప్పగా చెప్పుకోను, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్తున్న సమయంలో అనేక సన్నివేశాలు నన్ను బాగా ఎంటర్టైన్ చేశాయి. సినిమా చాలా ఎంగేజింగ్ గా ఉందని అనిపించింది. మీ అందరికీ కూడా అలాగే అనిపిస్తుందని అనుకుంటున్నాను. హరీష్ శంకర్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పని చేసాడు. సినిమాని కేవలం 45 రోజుల్లో పూర్తి చేసాము. ఎలా వచ్చానో, ఎలా షూటింగ్ చేసుకొని వెళ్లానో అర్థం కాలేదు. అంత తేలికగా షూటింగ్ జరిగేలా చూసుకున్నాడు హరీష్ శంకర్. ఇలాంటి టెక్నీషియన్స్ దొరికితే సినిమాలు చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ‘ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేనంటే పడని రాజకీయ నాయకులూ కొంతమంది అంటూ ఉంటారు, నాకేమనిపిస్తుందంటే రాజకీయాల్లో ఉన్న ప్రతీ ఒక్కరు కాంట్రాక్టులు చేసుకుంటూ ఉంటారు. వాళ్లందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమాలు ఉన్నాయి. సినిమా అనేది నాకు నరనరాల్లో నాటుకుపోయింది. నా నుండి సినిమాని వేరు చెయ్యలేరు’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ . ఇది విన్న తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టలేదు, కేవలం కామాలు మాత్రమే ఉంటుంది. గ్యాప్ రావొచ్చేమో కానీ కచ్చితంగా సినిమాలు చేస్తాను అనే క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. కాబట్టి అభిమానులు ఆయన నుండి ఓజీ 2 , ఓజీ 3 లాంటివి భవిష్యత్తులో కచ్చితంగా ఆశించవచ్చు అన్నమాట. పవన్ కళ్యాణ్ పూర్తి స్పీచ్ కి సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.