చైనాలో మొదలైన కరోనా వైరస్ క్రమంగా అన్ని దేశాలకు పాకింది. కరోనా దాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవగా అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడిపోయాయి. అమెరికా.. ఇటలీ.. బ్రిటన్.. బ్రెజిల్ లాంటి దేశాలు సైతం కరోనాను ఎదుర్కోలేక చతికిలపడ్డాయి. ప్రధానంగా యూరప్ దేశాలు కరోనాతో ఇబ్బందులు పడ్డాయి.
Also Read: ప్రభాస్ సినిమాను పట్టించుకున్నవారే లేరు !
ఇటలీలో కరోనా మరణాలు అత్యధికంగా జరిగిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పలువురు దర్శక, నిర్మాతలు తమ సినిమాలను ఇటలీలో షూటింగ్ చేసేందుకు అక్కడికి వెళుతున్నారు. ఈక్రమంలోనే డార్లింగ్ ప్రభాస్ సైతం ‘రాధేశ్యామ్’ షూటింగ్ కోసం ఇటీవల ఇటలీ వెళ్లాడు.
ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలోనే చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలను కూడా ‘రాధేశ్యామ్’ చిత్రయూనిట్ ఇటలీలోనే చేసింది. కాగా యూరప్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో ప్రభాస్ సినిమాకు ఇబ్బందులు తప్పడం లేదని సమాచారం.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం మరోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దీంతో ఇటలీ లాంటి దేశాల్లో రాత్రివేళ్లలో కర్ఫ్యూ విధించడంతోపాటు పగటి పూట కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా ఇటలీ నుంచి ఇండియాకు వచ్చేందుకు ‘రాధేశ్యామ్’ యూనిట్ ప్రయత్నిస్తుందని సమాచారం.
Also Read: ‘మీటూ’ వివాదంలోకి మణిరత్నంను లాక్కొచ్చిన చిన్మయి
నితిన్ ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లాలని చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని రంగ్ దే బృందం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని ఒక సాంగ్ ఇండియాలో.. మరో సాంగ్ సెట్లో చేయాలని భావిస్తున్నారు. ప్రభాస్ కష్టాలను చూసి నితిన్ ను ప్లాన్ మార్చుకోవడం గమనార్హం.