ప్రభాస్ సినిమాను పట్టించుకున్నవారే లేరు !

రెబల్ స్టార్ట్ ప్రభాస్ స్టార్ డమ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆయన రేంజ్ పాన్ ఇండియాకు మారిపోయింది. ఆయన మీద అంచనాలు భారీగా ఏర్పడిపోయాయి. అలాంటి అంచనాలతో వచ్చిన చిత్రం ‘సాహో’. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న చిత్రమంటే ప్రేక్షకులు ‘బాహుబలి’ని మించి ఉండాలనే ఆశిస్తారు. కానీ ‘సాహో’ ఆ అంచనాలను తలకిందులు చేసింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టింది. Also Read: పవన్ […]

Written By: admin, Updated On : October 29, 2020 5:49 pm
Follow us on


రెబల్ స్టార్ట్ ప్రభాస్ స్టార్ డమ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆయన రేంజ్ పాన్ ఇండియాకు మారిపోయింది. ఆయన మీద అంచనాలు భారీగా ఏర్పడిపోయాయి. అలాంటి అంచనాలతో వచ్చిన చిత్రం ‘సాహో’. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న చిత్రమంటే ప్రేక్షకులు ‘బాహుబలి’ని మించి ఉండాలనే ఆశిస్తారు. కానీ ‘సాహో’ ఆ అంచనాలను తలకిందులు చేసింది. వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టింది.

Also Read: పవన్ రెమ్యునరేషన్ రోజుకు అంత తీసుకుంటున్నాడా..!

ఊహించుకున్న దాంట్లో కనీస స్థాయిలో కూడ సినిమా లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు, చివరికి ఆయన అభిమానులు కూడ నిర్ధాక్షిణ్యంగా మొహం చాటేశారు. ఫలితంగా సినిమా రన్ విపరీతమైన నష్టాలతో ముగిసింది. అయితే బాలీవుడ్లో మాత్రం ఈ చిత్రం ప్రభావం చూపగలిగింది. లాభాల సంగతేమో కానీ భారీ నష్టాల నుండైతే తప్పించుకోగలిగింది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇంతలా పరాజయం చెందుతుందని అభిమానులు కలలో కూడ అనుకోలేదు. తీరాచూస్తే బిగ్ స్క్రీన్ మీదే కాదు స్మాల్ స్క్రీన్ మీద కూడ సినిమా చతికిలపడింది.

Also Read: చిరంజీవితో సినిమా చేస్తే కీర్తికి కెరీర్ ఉండదా ?

కొన్నిరోజుల క్రితం జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా తొలిసారి ప్రీమియర్ల రూపంలో ప్రదర్శితమైంది. సినిమా హాళ్లలో ఎలాగూ ఫ్లాప్ అయింది కనీసం టీవీల్లో అయినా అలరిస్తుందేమో, మంచి టీఆర్ఫీ రేటింగ్స్ సాధిస్తుందేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ థియేటర్లకు మించి టీవీల్లో నిరాశపరిచింది. కేవలం 5.8 టీఆర్ఫీతో సరిపెట్టుకుంది. అదే రోజున ఇతర ఛానెళ్లలో విడుదలైన చిన్న సినిమాలు కూడ ఇంతకంటే మంచి రేటింగ్స్ పొందాయి. దీన్నిబట్టి చిత్రాన్ని ప్రేక్షకులెవ్వరూ పట్టించుకోలేదని అర్థమైంది.