ఇంటర్‌ పాసైతే చాలు.. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు: జీవో జారీ

ఇంటర్‌లో ఈ సంవత్సరం తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఎంసెట్‌ కౌన్సెలింన హాజరుకావచ్చని విద్యాశాఖ గురువారం జీవో జారీ చేసింది. ఇంటర్‌ పాసైన ఎవరైనా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చంది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసింది. అయితే అంతకుముందు ఫ్రీపైనల్‌ పరీక్షల ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించారు. ఈ నేపథ్యంలో కొందరికి మార్కులు తక్కువగా వచ్చాయి. అయితే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటే కనీసం 45 మార్కులు ఉండాలి. 45 మార్కులు రానివారు, […]

Written By: Suresh, Updated On : October 29, 2020 6:01 pm
Follow us on

ఇంటర్‌లో ఈ సంవత్సరం తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఎంసెట్‌ కౌన్సెలింన హాజరుకావచ్చని విద్యాశాఖ గురువారం జీవో జారీ చేసింది. ఇంటర్‌ పాసైన ఎవరైనా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చంది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసింది. అయితే అంతకుముందు ఫ్రీపైనల్‌ పరీక్షల ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించారు. ఈ నేపథ్యంలో కొందరికి మార్కులు తక్కువగా వచ్చాయి. అయితే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలంటే కనీసం 45 మార్కులు ఉండాలి. 45 మార్కులు రానివారు, ఫెయిల్‌ అయిన విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలకు స్పందించిన తెలంగాణ సర్కార్‌ పై విధంగా జీవో జారీ చేసింది.