Mahesh Babu Varanasi: దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఆయన దాదాపు 15 సంవత్సరాల పాటు వేచి చూశాడు అంటే మామూలు విషయం కాదు. 2010 వ సంవత్సరంలోనే వీళ్ళ కాంబినేషన్లో సినిమా రావాల్సింది. కానీ మహేష్ బాబు డేట్స్ దొరక్కపోవడం వల్ల ఆ సినిమా అయితే వర్కౌట్ కాలేదు.
దాంతో 15 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక హై బడ్జెట్ మూవీ అనేది తెరకెక్కుతుండటం విశేషం… ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధిస్తానని రాజమౌళి చాలా మంచి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఇక తనతో పాటుగా మహేష్ బాబు సైతం ఈ సినిమా తనకు ఒక బ్రేక్ ఈవెన్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఉన్నాడు…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఒక్క షాట్ మేకింగ్ కోసం ఎంత సమయాన్ని తీసుకుంటాడో మనందరికి తెలిసిందే. దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి ఆయన చాలా వరకు కష్టపడుతూ ఉంటాడు.
అసలు కాంప్రమైజ్ అవ్వడు ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు కోసం ఒక రెండు షాట్స్ తీయడం కోసం దాదాపు సంవత్సరం పాటు అతన్ని కంటిన్యూటి లోనే ఉంచాడట… తనను ఎటు వెళ్ళనీయకుండా కటింగ్ గాని, గడ్డం గాని కొంచెం కూడా కట్ చేయకుండా అదే మాదిరిగా చూసుకుంటూ వచ్చాడు.
మొత్తానికైతే మహేష్ బాబు దాన్ని కొంతవరకు ఇబ్బందిగా ఫీల్ అయినప్పటికి రాజమౌళి సినిమా కాబట్టి మహేష్ బాబు సైతం చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…