ఏ క్షణాన మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో.. అప్పుడే తెలంగాణ లో టీడీపీ కి గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. అప్పటి నుంచి తెలంగాణ ఏర్పడే వరకు అంత ఇంతో ఉన్నా పచ్చ పార్టీ.. ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ పొలిమేరలు దాటి ఆంధ్రాలో సెటిల్ అయిపోయింది. చంద్ర బాబు రెండు కండ్ల సిద్ధాంతం నుంచి ఒక కన్ను సిద్ధాంతానికి పరిమితమైన కాలక్రమంలో తెలంగాణలో ఆ పార్టీ కుచించుకుపోయింది. వేళ్లలో లెక్క పెట్టేంత లీడర్లు.. వందల సంఖ్యలోకి క్యాడర్ పడిపోయింది. పూర్తిగా ఆంధ్రా రాజకీయాలకే పరిమితమైన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. తెలంగాణలో సో.. సో.. గా పార్టీని నడిపిస్తున్నారు.
Also Read: కేసీఆర్ అంటే పవన్‌కు అందుకే భయమా?
మొన్న సోమవారం తెలంగాణ రాష్ట్ర కమటీని చంద్ర బాబు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మూడో సారి ఎల్ . రమణ నియమించారు. ఈ కమిటీలో 30మందికి చోటు కల్పించారు. 2014లో తెలంగాణ అవతరణ సందర్భంగా మొదటి అధ్యక్షుడిగా నియమితులైన రమణ.. వరుసగా మూడో సారి పదవి చేపట్టారు. విభజన నుంచి తెలంగాణలో పూర్తిగా వైభవం కోల్పోయిన పార్టీ నుంచి సీనియర్ లీడర్లు దాదాపుగా వెళ్లిపోయారు. మిగిలిన కొద్ది మంది కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదు. అంటే తెలంగాణలో పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా లేవనే చెప్పాలి.
అయితే పార్టీ ఇబ్బందుల్లో ఉందని.. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని, యువ రక్తానికి అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు చంద్ర బాబు నేరుగా కలిసి సూచించారు. ఏడేళ్లుగా పార్టీ బలోపేతానికి రమణ చేసిందేమీ లేదని ఆరోపించారు. పార్టీకి యువ నేతల అవసరముందని యువ నేతకే అవకాశమివ్వాలని కోరారు. అయితే వీళ్ల విజ్క్షప్తులను చంద్రబాబు పట్టించుకున్నట్లు కనబడలేదు. మళ్లీ రమణనే కంటిన్యూ చేస్తున్నారు. దీనికి కేవలం సామాజిక సమీకరణే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రమణను కొనసాగించడం వల్ల బీసీ ఓటు బ్యాంకును తిరిగి దగ్గరకు తీసుకోవచ్చని చంద్ర బాబు భావించవచ్చని చెబుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఎల్లో పార్టీకి బీసీలు దూరమై చాలా కాలమైపోయిందని.. అధ్యక్షుడిగా రమణ ఉన్నా.. మరొకరు ఉన్నా పెద్దగా బావుకునేది ఏమీ లేదని అంటున్నారు.
Also Read: యాంటీ మీడియా: జగన్‌కు అదే పెద్ద ప్లస్ పాయింట్
చంద్రబాబు బీసీ ఓటు బ్యాంకును పరిగణలోకి తీసుకున్నా కూడా.. ఏడేళ్లుగా చేస్తున్న రమణ తప్పా మరేవరూ పార్టీలో లేరా అని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కుమార్ గౌడ్ లాంటి బీసీ నేతలు చాలా మందే ఉన్నారు కదా అంటున్నారు. కానీ మరి చంద్రబాబు కొత్త వాళ్లను కాదని రమణనే ఎందుకు కంటిన్యూ చేయాలని భావించారో ఎవరికీ అర్థం కావడం లేదని సదరు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తానికి మరో సారి అవకాశం వచ్చిన రమణ ఈసారైనా పార్టీకి ఏమైనా జవజీవాలు తెస్తాడమో చూడాలి.