ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంటే పూనకం వచ్చినట్లుగానే ఎగిరిపడే పవన్ కల్యాణ్.. మరి తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు. అదేంటో.. అసలు ఆయన పేరు వింటేనే వణికిపోతారా అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. ప్రశ్నించడం కోసమే పార్టీ అని జనసేనను స్థాపించిన పవన్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విషయంలో అనుసరిస్తున్న ధోరణిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: సీఎం కేసీఆర్ అలా నోరు తెరిచి సాయం ఎందుకు కోరినట్లు..?
ఇరు రాష్ట్రాల సమస్యలపై ఏపీలో ఒక విధంగా, తెలంగాణ మరో రకంగా స్పందించడం పవన్ కల్యాణ్‌కు బాగా అలవాటైంది. తాజాగా వరద నష్టాలపై కూడా పవన్ ఇదే వైఖరిని అమలు చేశారు. హైదరాబాద్ వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అక్కడి ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ కోటి రూపాయల సాయం అందించడాన్ని ఎవరూ విమర్శించడం లేదు. కానీ.. అదే టైంలో ఏపీలోనూ భారీగా వరదలు వచ్చాయి. రైతులు విలవిల్లాడుతున్నారు. కనీసం ఒక్క సీటు అయిన ఇచ్చిన ఏపీ ప్రజలు ఆయనకు ఏం అన్యాయం చేశారని ఇప్పుడు సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలు.
పోనీ అది ఆయన వ్యక్తిగత వ్యవహారం అనుకున్నా.. పార్టీ పరంగా తీసుకున్న స్టాండ్‌ను కేసీఆర్ కోసం పక్కనపెట్టారని తెలుస్తోంది. హైదరాబాద్ వరదల్లో పరామర్శకు వెళ్లిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ తప్పంతా కేసీఆర్ సర్కార్ దేనంటూ విమర్శించారు. వలస పాలకులపై దుమ్మెత్తిపోసిన కేసీఆర్, తాను అధికారంలోకి వచ్చాక ఏం ఒరగబెట్టారని, ఏదైనా చేసి ఉంటే.. హైదరాబాద్‌కు ఈ ముంపు బాధ తప్పేదని అన్నారు. కిషన్ రెడ్డి మాత్రమే కాదు, తెలంగాణ బీజేపీ కూడా కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.
Also Read: కంగనాకు వార్నింగ్.. ‘నడిరోడ్డుపై రేప్ చేస్తా’..!
మరి బీజేపీతో చెలిమి చేస్తున్న జనసేనాని.. కేసీఆర్ సర్కారుపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. మరోవైపు తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సులు నడవకపోవడానికి కారణం కూడా జగన్ అని ఆయన నిందిస్తుంటారు. తెలంగాణ అధికారుల మంకు పట్టు వల్లే ఇన్నాళ్లూ ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొందనే విషయం పవన్‌కు కూడా తెలుసు కదా..! మరి దసరా సందర్భంగా బస్సులు నడవకపోవడాన్ని ఏపీ ప్రభుత్వ వైఫల్యంగా ఎలా పరిగణిస్తారు. ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏంటి అర్థం. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి కానీ.. విమర్శించే ఓపిక కానీ.. విమర్శించే ఆలోచన కానీ లేకుంటే ఇక తెలంగాణలో జనసేన పార్టీ ఎందుకు..? ఒక్క ఏపీకే పరిమితం చేస్తే సరిపోతుంది కదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.