https://oktelugu.com/

‘ఎన్టీఆర్’ కొత్త బిజినెస్.. ఐడియా సూపర్ !

మన స్టార్ హీరోలు సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకుంటున్నారు. కొత్తగా ఎన్టీఆర్ కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నాగార్జున స్టూడియో, నిర్మాణంతో పాటు వేరే వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ తో పాటు ఎంబీ ప్రొడక్షన్స్ అనే పేరుతో మూవీ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు. తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను […]

Written By:
  • admin
  • , Updated On : June 20, 2020 / 08:42 PM IST
    Follow us on


    మన స్టార్ హీరోలు సినిమాలతో పాటు బిజినెస్ లు కూడా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకుంటున్నారు. కొత్తగా ఎన్టీఆర్ కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నాగార్జున స్టూడియో, నిర్మాణంతో పాటు వేరే వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ తో పాటు ఎంబీ ప్రొడక్షన్స్ అనే పేరుతో మూవీ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు. తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు మహేష్. ఇంతకీ ఎన్టీఆర్ ప్లాన్ చేస్తోన్న బిజినెస్ ఏంటంటే ‘యువ’ అనే టీవీ ఛానెల్ పెట్టబోతున్నాడు.

    కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

    ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ గాసిప్ గా హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ మామయ్య నార్నె శ్రీనివాస రావుకి ఇప్పటికే ఒక టీవీ ఛానల్ ఉంది. అయితే ఎన్టీఆర్ ఆ ఛానెల్ కు అనుసంధానంగా తన మామయ్య సహాయంతో మరో కొత్త ఛానెల్ ప్రారంభించబోతున్నాడని.. ఆ టీవీ ఛానెల్‌ పేరు ‘యువ’ అని తెలుస్తోంది. మొత్తానికి పేరు ఆసక్తికరంగా అనిపిస్తుంది.

    ‘పది’ పరీక్షలపై ఏపీ నిర్ణయం ఇదే..!

    ఇక గత కొన్నేళ్లుగా థియేటర్ల వ్యాపారం కంటే కూడా టీవీ పరిశ్రమల వ్యాపారం బాగుండటం, కొత్తగా ఓటీటీ పరిశ్రమ కూడా బాగా పుంజుకుంటుండటంతో ఎన్టీఆర్ టీవీ బిజినెస్ లోకి దిగుతున్నాడట. మరి ఎన్టీఆర్ మరియు ఆయన టీవీ బృందం ప్రేక్షకుల కోసం ఎలాంటి కార్యక్రమాలను ప్లాన్ చేస్తారో చూడాలి.