కరోనా మహ్మమరికి సైంటిస్టులు వాక్సిన్ కనుగోనేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కరోనా ఉసరవెల్లిలా రూపాంతారం చెందుతుండటంతో వాక్సిన్ కనుగోనడం కొంచెం కష్టంగా మారింది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుడిలా కరోనాకి వాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే భారత దిగ్గజ కంపెనీ కరోనాకు మెడిసన్ తయారుచేసింది. దీనికి కేంద్రం ప్రభుత్వం అనుమతి లభించడంతో త్వరలోనే మార్కెట్లో రానుంది.
కరోనా ఎఫెక్ట్.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం బెంబెలెత్తిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం ఈ మహమ్మరి దాటికి కాకవికలం అవుతున్నాయి. భారత్లోనూ కరోనా కేసుల సంఖ్య రోజుకురోజుకు పెరుగుతోంది. ఈనేపథ్యంలోనే భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఇప్పటికే తాము మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ మెడిసిన్ కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని సదరు కంపెనీ వెల్లడించింది.
‘ఫాబిఫ్లూ బ్రాండ్’ పేరిట మెడిసిన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిందని గ్లెన్ మార్క్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దన్హా ప్రకటించారు. కరోనాపై ‘ఫాబిఫ్లూ’నే తొలి ఓరల్ ఔషధమని ఆ సంస్థ వెల్లడించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో తమ సంస్థ కలిసి పనిచేస్తుందని వెల్లడించారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ మెడిసిన్ ధర కూడా తక్కువ ధరలో లభించడనుండటం విశేషం. ఒక్కో మాత్ర ధర రూ.103 మాత్రమేనని పేర్కొంది.
‘పది’ పరీక్షలపై ఏపీ నిర్ణయం ఇదే..!
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో తమ కంపెనీకి అనుమతి లభించాయని ఆ సంస్థ తెలిపింది. తమ మెడిసిన్ వాడటం ద్వారా వైద్యులు, రోగులపై ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో ఫాబిఫ్లూను కరోనా రోగులపై సత్ఫలితాలిచ్చిందని పేర్కొన్నారు. స్వల్ప కరోనా లక్షణాలు, మధ్య స్థాయిలో ఉన్నవారిపై ఈ ఔషధం బాగా పని చేసిందని తెలిపారు. వీరితోపాటు డయాబెటిక్, గుండె జబ్బు వ్యాధిగ్రస్తులు కూడా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చని తెలిపారు. నాలుగు రోజుల్లోనే వైరల్ లోడ్ తగ్గిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఎట్టకేలకు భారత మార్కెట్లోకి కరోనా మెడిసిన్ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.