Nani Bloody Romeo Movie Update: నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఒప్పుకొని , తన కెరీర్ లోనే పెద్ద తప్పు చేశాడా?, ఈ సినిమా ఆయన సమయాన్ని చాలా వరకు వృధా చేస్తుందా ? అనే అనుమానాలు నాని అభిమానుల్లో , మూవీ లవర్స్ లో కలుగుతున్నాయి. నాని సినీ కెరీర్ ని ‘దసరా’ కి ముందు , ఆ తర్వాతగా డివైడ్ చేయొచ్చు. అప్పటి వరకు మామూలు జానర్ సినిమాలు చేస్తూ వచ్చిన నాని , ఈ సినిమా తో వేరే లెవెల్ కి వెళ్లే ప్రయత్నం చేసాడు. అనుకున్నట్టుగానే ఆ సినిమా సక్సెస్ అయ్యింది , ఆ తర్వాత నాని చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ‘దసరా’ తో తన స్థాయిని పెంచిన డైరెక్టర్ కావడం తో శ్రీకాంత్ ఓదెల ని బలంగా నమ్మాడు నాని.
అలా నమ్మి ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడ్డాడో , ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి ఇవ్వడానికి ఆయన ఏమేమి చేస్తున్నాడో మన కళ్ళకు కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ‘ఆయా షేర్’ సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసి , తన టాలెంట్, కసి ఈ సినిమా కోసం ఎలా ఖర్చు చేస్తున్నాడో అందరికీ అర్థం అయ్యింది. ఈ సినిమా కథ పై చాలా బలమైన నమ్మకం పెట్టుకోవడం వల్లే, సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆడియన్స్ లో ఈ చిత్రం పై కావాల్సినంత హైప్ , క్రేజ్ ఉంది. కానీ వరుస వాయిదాలు కారణంగా ఈ చిత్రం పై హైప్ డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో , ఆగస్టు 21 కి వాయిదా వేశారు.
ఇప్పుడు ఆ తేదీ నుండి కూడా ఈ సినిమా వాయిదా పడింది , షూటింగ్ పూర్తి అవ్వడానికి మరో 60 రోజుల సమయం ఉంది. మరో పక్క ‘ఓజీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసి , యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సుజిత్ , నాని కోసం ‘బ్లడీ రోమియో’ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రెడీ గా ఉన్నాడు. కానీ నాని మాత్రం అందుబాటులో లేడు . రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్స్ ని రెక్కీ చేయడం కోసం లండన్ కి కూడా వెళ్ళాడు సుజిత్. అయితే ఇంతలోపే పవన్ కళ్యాణ్ నుండి సుజిత్ కి ఫోన్ వచ్చింది. ‘ఓజీ 2’ కోసం డేట్స్ అడిగావు కదా, నేను ఈ ఏడాది లోనే డేట్స్ ఇవ్వడానికి సిద్ధం , ఇండియా కి వచ్చినప్పుడు కలవు అని అన్నాడట. ఇప్పుడు సుజిత్ తన ద్రుష్టి మొత్తాన్ని ‘ఓజీ 2’ కి షిఫ్ట్ చేశాడు. దీంతో ‘బ్లడీ రోమియో’ పరిస్థితి ఏంటి?, పూర్తిగా ఆగిపోయినట్టేనా?, ‘ది ప్యారడైజ్’ కోసం నాని ఈ చిత్రాన్ని త్యాగం చేశాడా ?, ఆ త్యాగానికి తగ్గ ఫలితం ‘ప్యారడైజ్’ ఇస్తుందో లేదో చూడాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
