Homeఎంటర్టైన్మెంట్Amitabh Bachchan 82 Age Record: 82 ఏళ్ళ వయస్సులో సంచలన రికార్డుని నమోదు చేసిన...

Amitabh Bachchan 82 Age Record: 82 ఏళ్ళ వయస్సులో సంచలన రికార్డుని నమోదు చేసిన అమితాబ్ బచ్చన్.. కుర్రోళ్లకు కూడా అసాధ్యం ఇది..

Amitabh Bachchan 82 Age Record: అమితాబ్ బచ్చన్ గురించి కొత్తగా ఏమి చెప్తాము చెప్పండి, ఆయన లాంటి లెజెండ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో చాలా అరుదుగా ఉంటారు అని మాత్రమే చెప్పగలం. అంతకు మించిన మాటలు ఆయన స్థాయిని వర్ణించడానికి మన వద్ద లేవు. 80 ఏళ్ళ వయస్సులో ఆయన ‘కల్కి 2898 AD ‘ లో చూపించిన నట విశ్వరూపాన్ని చూసి నేటి తరం జెన్ జీ ఆడియన్స్ కూడా షాక్ కి గురయ్యారు. ఆరోజుల్లో జనాలు ఎందుకు అమితాబ్ బచ్చన్ సినిమాలకు వెర్రిక్కిపోయేవారో , అమితాబ్ ని మించిన బిగ్గెస్ట్ మాస్ సూపర్ స్టార్ ఇండియా లో ఎవ్వరు లేరని ఎందుకు అనేవారో , కల్కి చిత్రాన్ని చూసిన నేటి తరం ఆడియన్స్ మొత్తానికి అర్థం అయ్యింది. ఆ వయస్సులో ఆయన చేసిన ఫైట్స్ , స్క్రీన్ ప్రెజెన్స్ గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.

ఇకపోతే ప్రస్తుతం ఆయన వయస్సు 82 ఏళ్ళు. ఈ వయస్సులో ఆయన మరో సంచలన రికార్డుని నమోదు చేశాడు. కేవలం ఒక్క రోజులో 12 షార్ట్ ఫిలిమ్స్ ని లో నటించి, మధ్యలో రెండు స్టిల్ షూట్స్ కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘పని అంటే పనే, అందులో వయస్సుతో సంబంధమే లేదు , అసలు రాజీ పడకూడదు. నేడు నేను 12 షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్స్ తో పాటు , రెండు ప్రత్యేక స్టిల్ షూట్స్ లో పాల్గొన్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా సరే , సమాజం తో నన్ను కనెక్ట్ చేసిన ఈ సినిమా కోసం నిరంతరం పని చేస్తూనే ఉండాలి అనేది నా కోరిక. అందులో ఎలాంటి ఆలస్యం లేదు. మిగతావన్నీ జీవితం లో అలా సాగిపోతూనే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు అమితాబ్ బచ్చన్.

ఆయన మాట్లాడిన ఈ మాటలు నేటి తరం యువతకు ఎంతో ఆదర్శప్రాయం. నేటి తరం యువత 8 గంటలు పని చెయ్యడానికి నీరసించి పోతుంటారు. మన శరీరం అంతకు మించి పని చేయడానికి అసలు సహకరించదు. మనకే ఇలా ఉంటే , 82 ఏళ్ళ వయస్సు ఉన్నవాళ్లకు ఎలా ఉంటుంది చెప్పండి?, కానీ అమితాబ్ బచ్చన్ ఆ వయస్సు లో కూడా ఈ రేంజ్ లో కష్టపడి పని చేస్తున్నాడంటే , ఆయన తన పనిని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం అవుతోంది. ఒక మనిషి ఇందులో అయినా సక్సెస్ అవ్వాలంటే ముందు తానూ చేసిన పనిని ప్రేమించాలి. అప్పుడు సహజంగానే అన్ని జరిగిపోతాయి అనడానికి అమితాబ్ బచ్చన్ ఒక ఉదాహరణ. ఏ రంగం లో ఉన్న వారైనా ఇది గుర్తు పెట్టుకోవాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...

Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు..

Qualities Women Like In Men: ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఒక పురుషుడిని ఒక మహిళ ఏ విషయంలో ఇష్టపడుతారు? అనే సందేహం ఇప్పటికీ...

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...
Oktelugu Epaper
Exit mobile version