Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda new movie: మార్కెట్ లేదని నితిన్ తో చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండ...

Vijay Deverakonda new movie: మార్కెట్ లేదని నితిన్ తో చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండ తో చేస్తున్న స్టార్ డైరెక్టర్.. అవమానమే ఇది..

Vijay Deverakonda new movie: వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇచ్చిన కం బ్యాక్స్ ఎలాంటివో గతం లో మనం చాలానే చూశాము . అలాంటి కం బ్యాక్ ఇచ్చిన హీరోల్లో నితిన్ ఒకరు. ఈయన కం బ్యాక్ టాలీవుడ్ కి ఒక కేసు స్టడీ లాంటిది. వరుసగా 14 ఫ్లాప్స్ తర్వాత , కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో , ఇష్క్ చిత్రం ద్వారా భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని , తిరుగులేని కం బ్యాక్ ఇచ్చాడు నితిన్. ఈ సినిమా తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన వసరం రాలేదు. వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ , తనకంటూ ఒక స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. సినిమాని థియేటర్స్ లో విడుదల కూడా చేసుకోలేని స్థాయి నుండి , స్థిరమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకునే స్థాయి వరకు ఎదిగిన నితిన్ ని యంగ్ హీరోలు ఆదర్శంగా తీసుకోవాలి.

అయితే కరోనా లాక్ డౌన్ తర్వాత నితిన్ కి అసలు ఏది కలిసిరావడం లేదు. చేసిన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చాయి. ఆ కారణం చేత ఒకప్పుడు నితిన్ వరుస ఫెయిల్యూర్స్ తో ఎలాంటి దయనీయమైన స్థితికి వచ్చేసాడో , ఇప్పుడు కూడా అదే స్థాయికి పడిపోయాడు. ముఖ్యంగా తాను దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఆదుకున్న డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. అప్పటికి ఆయనకు కూడా పెద్దగా ఇండస్ట్రీ లో పేరు లేదు. అలాంటి సమయం లో ఆయన నితిన్ తో తీసిన ‘ఇష్క్’ చిత్రం కారణంగా , ఇద్దరి తలరాత మారిపోయింది. ఇప్పుడు కూడా విక్రమ్ గొప్ప స్థాయిలో అయితే లేడు , కానీ నితిన్ కంటే చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నాడు. రీసెంట్ గానే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయ్యింది.

ఎట్టకేలకు నితిన్ కి చాలా కాలం తర్వాత మంచి సినిమా రాబోతుందని అంతా అనుకున్నారు , కట్ చేస్తే , నితిన్ కి ప్రస్తుతం మార్కెట్ లేకపోవడం తో, అతనితో సినిమా చేయడానికి నిర్మాతలు సుముఖంగా లేరని తెలుస్తోంది. అందుకే రీసెంట్ గా విక్రమ్ కె కుమార్ ప్రముఖ క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ని కలిసి , నితిన్ కి చెప్పిన కథని , అతనికి వివరించాడట. విజయ్ దేవరకొండ కి ఈ కథ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. వెంటనే కాల్ షీట్స్ ఇచ్చేశాడని అంటున్నారు. ఒకప్పుడు నితిన్ తో కలిసి ప్రయాణం చేసి , అతనితో మంచి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్న విక్రమ్ కె కుమార్ కి పాపం ఇలాంటి నిస్సహాయత పరిస్థితి రావడం బాధాకరం , నితిన్ కి కూడా ఇది చాలా పెద్ద అవమానమే అని చెప్పొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version