Homeఆంధ్రప్రదేశ్‌Undavalli Arun Kumar Audio Viral: ఉండవల్లిని సైతం లాగేసుకున్న వైసిపి.. ఆడియో వైరల్!

Undavalli Arun Kumar Audio Viral: ఉండవల్లిని సైతం లాగేసుకున్న వైసిపి.. ఆడియో వైరల్!

Undavalli Arun Kumar Audio Viral: రాజకీయాలు విడిచిపెట్టి విశ్లేషకుడి అవతారం ఎత్తారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. సమకాలీన అంశాలపై విశ్లేషణలు చేస్తుంటారు ఉండవల్లి అరుణ్ కుమార్. నెలకు,, 15 రోజులకు, ఏదైనా ఘటన జరిగినప్పుడు మీడియా ముందుకు వచ్చి విశ్లేషిస్తుంటారు రాజకీయాంశాలపై. అది కూడా ఎక్కువగా రాజమండ్రిలో తన స్వస్థలంలో మీడియాను పిలిచి ఎక్కువగా మాట్లాడుతుంటారు. రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉండడంతో మీడియా సైతం ఆయనకు ప్రాధాన్యమిస్తూ వస్తోంది. అయితే ఆయన మాటల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల ఫేవర్, ఫ్లేవర్ రెండు కనిపిస్తుంటాయి. చంద్రబాబు నాయకత్వాన్ని పొగుడుతూనే ఆయనలో ఉన్న మైనస్లను ఎత్తిచూపుతుంటారు. జగన్ విషయంలో మాత్రం పరోక్షంగా అభిమానం చూపుతారన్న విమర్శ ఉండవల్లి అరుణ్ కుమార్ లో ఉంది. అయితే ఇప్పుడు అదే విషయాన్ని ఇద్దరు వైసిపి నేతలు మాట్లాడుకోవడానికి సంబంధించిన ఆడియో ఫోన్ కాల్ లీక్ అయ్యింది.

* అనుకూల విశ్లేషణలు..
ప్రస్తుతం రాజకీయ పార్టీలు పెంచి పోషించే డిజిటల్ మీడియా వచ్చేసింది. యూట్యూబ్ ఛానల్స్ తో పాటు అనేక రకాల వెబ్ సైట్లు వచ్చాయి. ఈ క్రమంలో విశ్లేషకుల ముసుగులో చాలామంది పార్టీలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో.. మరో నేత ఫోన్ లో మాట్లాడుతూ.. ఉండవల్లి అరుణ్ కుమార్ వాయిస్ మరింత పెంచాలని.. అప్పుడే పార్టీకి బాగుంటుందన్న అభిప్రాయాన్ని వేణుగోపాలకృష్ణతో మరో నేత ఫోన్ లో చెప్పుకొచ్చారు. ఆయన వాయిస్ పెంచుతారు అంటూ ఉండవల్లి గురించి వేణుగోపాలకృష్ణ అవతలి నేతకు సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ ఆడియో సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ ను సైతం వైసిపి పేటీఎం బ్యాచ్ వదలదా అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో..
ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించిన నేత. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన దృష్టిలో పడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. అలా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు 2004లో రాజమండ్రి ఎంపీగా సీటు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో గెలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్ పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2009లో రెండోసారి గెలిచారు. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో పార్టీ ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డిని నియంత్రించే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు. 2014లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా విశ్లేషణలు చేశారన్న విమర్శ ఉండవల్లి పై ఉంది. 2019 నుంచి 2024 మధ్య జగన్ సర్కార్ పై విమర్శలు చేసే క్రమంలో.. చంద్రబాబు మాదిరిగా స్ట్రాంగ్ డోస్ ఉండేది కాదు అని టిడిపి వర్గాలు ఉండవల్లి పై ఆగ్రహంగా ఉండేవి. ఇప్పుడు సైతం సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషిస్తున్నారు ఉండవల్లి. ఈ క్రమంలో టిడిపి కూటమి ప్రభుత్వంపై విమర్శలు కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ డోస్ పెంచాలని ఓ నేత వైసిపి మాజీమంత్రి ని కోరడం తో.. ఉండవల్లి అరుణ్ కుమార్ పై రకరకాల చర్చ నడుస్తోంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version