Homeఎంటర్టైన్మెంట్Chitram Srinu Accident Story: ఎన్టీఆర్ చెప్పిన మాట వినకుండా యాక్సిడెంట్ కి గురైన స్టార్...

Chitram Srinu Accident Story: ఎన్టీఆర్ చెప్పిన మాట వినకుండా యాక్సిడెంట్ కి గురైన స్టార్ కమెడియన్..ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే..

Chitram Srinu Accident Story: ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడిపిన వారిలో ఒకరు ‘చిత్రం’ శ్రీను. చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈ కమెడియన్ , ఆ తర్వాత ఆనందం , ఆది , నువ్వు లేక నేను లేను , సొంతం , నీ స్నేహం, మల్లీశ్వరి , వెంకీ, బన్నీ, బొమ్మరిల్లు , ఢీ , దుబాయ్ శీను, కృష్ణ , పరుగు , 100 % లవ్, మనం , దృశ్యం , రాజా ది గ్రేట్ , గీత గోవిందం ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈయన కామెడీ టైమింగ్ కి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఈమధ్య ఈయనకు ఒకప్పుడు ఉన్నటువంటి డిమాండ్ లేదు.

సినిమాలు అడపాదడపా చేస్తున్నాడు కానీ , ఈయన క్యారెక్టర్స్ ఎలివేట్ అవ్వడం లేదు. మధ్యలో ఈటీవీ లోకి ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు , కానీ ఆదరణ దక్కలేదు. అయితే రీసెంట్ గా ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అవేంటో ఒకసారి ఇందులో చూద్దాం. ఆయన్ని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ కెరీర్ ప్రారంభం లో ఒక ప్రమాదం జరిగింది. అప్పుడు ఒక స్టార్ హీరో మీ ఇంటికి వచ్చి , ఒక బ్లాంక్ చెక్ మీ చేతికి ఇచ్చి ఎంత కావాలో రాసుకోమన్నాడు అట , దాని సంగతి మాతో పంచుకోండి’ అని అడగ్గా , చిత్రం శ్రీను ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘జూనియర్ ఎన్టీఆర్ గారి మొదటి చిత్రం నిన్ను చూడాలని లో నేను నటించాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గారు నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఇప్పటికీ నాతో ఆయన అలాగే ఉంటారు. ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం నాకు ‘నువ్వు నేను’ మూవీ డేట్ ఉంది. ఇది నేను ఎన్టీఆర్ చెప్పాను. ఎక్కడికి వెళ్తావు నువ్వు , ఇక్కడే కూర్చో అన్నాడు. లేదు , డేట్ ఇచ్చాను , అది కూడా చాలా పెద్ద సినిమా అని చెప్పి బయలుదేరాను, మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ షాక్ కి గురయ్యాడట. ఉదయం వరకు నాతో ఎంతో సరదాగా మాట్లాడిన వ్యక్తికి ఇలా అయ్యిందే అని బాధపడ్డాడట. వెంటనే హాస్పిటల్ కి రెండు కొబ్బరి బోండాలను తీసుకొని నా వద్దకు వచ్చాడు. ఒక బ్లాంక్ చెక్ చేతిలో పెట్టి, నీ పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు, ఎంత కావాలో ఈ చెక్కులో రాసుకొని తీసుకో అన్నాడు. వద్దని ఎంత చెప్పినా ఆయన వినలేదు. ఆరోజు నా మీద ఎన్టీఆర్ చూపించిన ప్రేమ, కేరింగ్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు చిత్రం శ్రీను.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....
Oktelugu Epaper
Exit mobile version