https://oktelugu.com/

జగన్ నమ్మిన ఆ అధికారి ఎవరో తెలుసా?

ఏ రాష్ట్రంలో అయినా పాలన సక్రమంగా నడవాలన్నా.. ఆ రాష్ట్రం సక్సెస్‌ దిశగా కొనసాగాలన్నా ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) పాత్ర ఎంతో కీలకం. రాజకీయంగా సీఎం కీలకమైతే.. అధికారులతో పాలన ఎలా నడిపించాలనేది సీఎస్‌ బాధ్యత. సీఎం తీసుకున్న నిర్ణయాలపై సీఎస్‌ సంతకం చేస్తేనే ఆ ఫైల్‌ మూవ్‌ అవుతుంది. అంతటి పవర్‌‌ బాధ్యత సీఎస్‌ది. అయితే.. ఈ పదవులు దక్కాలంటే కూడా సీఎంకు అనుకూలంగా ఉన్న వారికి.. ఎలాంటి అడ్డంకులకు పోని వారికి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 9:52 am
    Follow us on

    Who Is Next Andhra Pradesh Chief Secretary

    ఏ రాష్ట్రంలో అయినా పాలన సక్రమంగా నడవాలన్నా.. ఆ రాష్ట్రం సక్సెస్‌ దిశగా కొనసాగాలన్నా ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) పాత్ర ఎంతో కీలకం. రాజకీయంగా సీఎం కీలకమైతే.. అధికారులతో పాలన ఎలా నడిపించాలనేది సీఎస్‌ బాధ్యత. సీఎం తీసుకున్న నిర్ణయాలపై సీఎస్‌ సంతకం చేస్తేనే ఆ ఫైల్‌ మూవ్‌ అవుతుంది. అంతటి పవర్‌‌ బాధ్యత సీఎస్‌ది. అయితే.. ఈ పదవులు దక్కాలంటే కూడా సీఎంకు అనుకూలంగా ఉన్న వారికి.. ఎలాంటి అడ్డంకులకు పోని వారికి దొరుకుతుంటాయి. అదే సమయంలో సీనియార్టీని కూడా బేస్ చేసుకుంటారు.

    Also Read: త్రిశంకు స్వర్గంలో ‘పోలవరం’.. ప్రాజెక్టు పూర్తయ్యేనా..?

    ఇప్పుడు ఏపీలో సీఎస్‌ మీద హాట్‌ టాపిక్‌ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో నీలం సాహ్ని సీఎస్‌గా ఉన్నారు. వాస్తవానికి ఆమె ప‌ద‌వీ కాలం అయిపోయింది. కానీ, జ‌గ‌న్ స‌ర్కారు ఆరు మాసాలు పెంచారు. దీనికి కార‌ణం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండ‌డమే. ఎన్నడూ లేనిది.. ఏ రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌నిది.. సీఎస్ హైకోర్టుకు హాజ‌రయ్యారు. ఇలాంటి ప‌రిణామాలు ఎదురు కావ‌డాన్ని సీఎస్ స్థాయి అధికారులు అవ‌మానంగా భావించి ప‌క్కకు త‌ప్పుకొంటారు. లేదా సీఎంకు స‌హ‌కారాన్ని త‌గ్గించుకుంటారు. కానీ, ఏపీలో మాత్రం సాహ్ని కోర్టుకు కూడా చిరునవ్వుతో వెళ్లి వ‌చ్చారు.

    జగన్‌ కూడా ఇలాంటి అధికారి కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇలా చెబితే వినే అధికారులనే కోరుకుంటున్నారు. మరోసారి ఆమెనే కొన‌సాగించాల‌ని సీఎం అనుకుంటున్నప్పటికీ అది సాధ్యపడేలా లేదు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారిని ఎంపిక చేయాల‌ని అనుకుంటున్నారు. ఇప్పుడున్న సీనియర్‌‌ అధికారుల్లో.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వానికి అనుకూలంగా క‌నిపిస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు పోల‌వ‌రాన్ని పొలిటిక‌ల్ అజెండాగా ఎంచుకున్నప్పుడు.. దీనిలో అవినీతి జ‌రిగింద‌ని చెప్పిన అధికారి ఆయ‌ననేన‌ని, జ‌గ‌న్ వ్యూహాల‌కు అనుగుణంగా చ‌క్రం తిప్పగ‌ల స‌మ‌ర్ధుడిగా ఆయ‌న నిలిచార‌ని వైసీపీలో చ‌ర్చసాగింది.

    Also Read: వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

    కొత్త సీఎస్‌గా ఆయననే నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన సీసీఎల్‌ఏ వంటి కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు. దాస్‌ ఏ విధంగా చూసినా అవినీతి ర‌హితుడు.. వివాద ర‌హితుడు.. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు సానుకూల‌మ‌నే అభిప్రాయం ఉంది. జ‌గ‌న్ చెప్పే ప్రతీ విష‌యాన్నీ వ్యతిరేకించే తత్వం కూడా కాదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు ఛాన్స్ ద‌క్కడం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. వాస్తవానికి సీనియార్టీ ప్రకారం చూస్తే స‌తీష్ చంద్ర ఈ వ‌రుస‌లో ముందున్నారు. కానీ, ఆయ‌న గ‌తంలో చంద్రబాబు హ‌యాంలో వైసీపీకి వ్యతిరేకంగా చ‌క్రం తిప్పార‌నే ఆరోప‌ణ‌లు ఉండడంతో దాస్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.