Superstitions Facts: దేశంలో చాలా మంది నమ్మకాలపై ఆధారపడి జీననాన్ని సాగిస్తుంటారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాన్ని పాటించేవారు ప్రతీ దానికి ఒక సమయం, సందర్భం చూసి చేస్తుంటారు. కొందరు వీటిని బలంగా నమ్ముతుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటుంటారు. శాస్త్రాలు, జ్యోతిష్యాన్ని ప్రగాఢంగా విశ్వసించేవారు శకునాలను బలంగా నమ్ముతారని తెలుస్తోంది.
వీరు బయటకు వెళ్లేముందు అటు ఇటు చూసుకుంటూ వెళ్తారు. అనుకోకుండా పిల్లి ఎదురువచ్చినా, కాకి భుజంపై తన్నినా ఏదో చెడు జరగబోతోందని కీడును శంకిస్తుంటారు. అందుకోసం పరిహారాలు చేయాలంటూ చెబుతుంటారు. పిల్లి ఎదురొస్తే వెళ్లే పని కాదని కొందరు నమ్ముతుంటారు. కాలి తలపై తంతే ఏకంగా ప్రాణగండం సంభవించవచ్చునని శాస్త్రం ఘోషిస్తోందని పండితులు హెచ్చరిస్తుంటారు.
అసలు శకునాల గురించి శకున్ శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. జంతువులు లేదా పక్షులు మనకు శుభం, అశుభ సూచకాలను ఇస్తుంటాయట.. వీటి ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, శకున శాస్త్రం ఏం చెబుతుందని ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయాన్నే ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతున్న టైంలో తెల్లని హంస, తెల్ల గుర్రం, నెమలి, చిలుక కనిపిస్తే దానిని శుభ సూచకంగా పరిగణించాలని శకున శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా హిందూ ధర్మంలో ఆవును చాలా పవిత్రమైన జంతువుగా చూస్తారు. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే క్రమంలో తెల్లని ఆవు కనిపించినా, ఆవు దూడకు పాలు ఇవ్వడాన్ని మీరు చూస్తే ఆ ప్రయాణం విజయవంతం అవుతుందట.. మనం ఏదైనా పనిచేయాలని భావించిన టైంలో చుట్టుపక్కల పిల్లి ప్రసవిస్తే శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది సంపదకు సూచిక.
Also Read: చంద్రబాబుపై జగన్ కు ఎంత ప్రేమో బయటపడింది!
ఇక పిల్లి ఏడుపు అనేది విపత్తుకు కారణం. పనిమీద బయటకు వెళుతున్నప్పుడు పిల్లి అడ్డొస్తే అది పూర్తికాదని శాస్త్రం చెబుతోంది. కాకి మన ఇంటిపై అరుస్తూ కనిపిస్తే అతిథులు వస్తారని చుట్టుపక్కల వారు ఇంట్లోని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ కాకి మీ తలపై లేదా మీ భుజంపై తన్నితే అది చెడు సంకేతంగా భావించాలని శకున శాస్త్రం స్పష్టం చేస్తోంది. ప్రమాదం లేదా వ్యాధులకు సంకేతమట.. ఇక బయటకు వెళ్లే క్రమంలో బురదలో తిరిగిన పందిని చూస్తే అది శుభ సూచకం కానీ, ఆ బురద ఎండిపోయి ఉంటే అది అశుభాన్ని కలుగజేస్తుంట.. చివరగా మన వెనుక గాడిద శబ్దం చేసిందంటే అది అశుభ సంకేతంగా పరిగణించాలి.