https://oktelugu.com/

PVP: పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?

PVP: ప్రముఖ వ్యాపార వేత్త, వైసీపీ ఎంపీ అయిన పోట్లూరి వరప్రసాద్ మరో వివాదంతో వార్తల్లో నిలిచారు. గతంలోనే ఆయనపై అనేక వివాదాలు, పలు పోలీస్ కేసులు ఉన్న సంగతి అందరికీ తెల్సిందే. తాజాగా తెలంగాణలోని ఓ ప్రముఖ బీజేపీ నేత కూతురి ఇంట్లోకి పీవీపీ అనుచరులు చొరబడి బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పీవీపీ సినిమా నిర్మాణంతోపాటు రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేస్తుంటారు. పలువురికి విల్లాలు, ప్లాట్స్ అమ్ముతూ సొమ్ము […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2022 / 12:01 PM IST
    Follow us on

    PVP: ప్రముఖ వ్యాపార వేత్త, వైసీపీ ఎంపీ అయిన పోట్లూరి వరప్రసాద్ మరో వివాదంతో వార్తల్లో నిలిచారు. గతంలోనే ఆయనపై అనేక వివాదాలు, పలు పోలీస్ కేసులు ఉన్న సంగతి అందరికీ తెల్సిందే. తాజాగా తెలంగాణలోని ఓ ప్రముఖ బీజేపీ నేత కూతురి ఇంట్లోకి పీవీపీ అనుచరులు చొరబడి బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

    PVP:

    పీవీపీ సినిమా నిర్మాణంతోపాటు రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేస్తుంటారు. పలువురికి విల్లాలు, ప్లాట్స్ అమ్ముతూ సొమ్ము చేసుకున్నారు. ఇందులో భాగంగానే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో ఓ విల్లాను తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి కొనుగోలు చేశారు. ఇంటి మరమత్తుల్లో భాగంగా ఆమె ప్రహరీ నిర్మాణం చేపట్టారు.

    Also Read:  కెనడాలో అంగరంగ వైభవంగా తాకా వారి 2022 సంక్రాంతి సంబరాలు

    ఈ సమయంలోనే పీవీపీ అనుచరులు శృతిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రహరీపాటు రేకులను జేసీబీతో ధ్వంసం చేయించారని శృతిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన తనపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈక్రమంలోనే పీవీపీతోపాటు ఆయన అనుచరులపై ఐపీసీ 447, 427, 506, 509 r/w34 కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

    ఇక గతంలోనూ ఇదే తరహాలో ప్రవర్తనతో పీవీపీ వివాదంలో ఇరుకున్నారు. పీవీపీ తన రియల్ కంపనీ ద్వారా ‘ప్రేమ్ పర్వత్’ అనే వెంచర్ వేసి గతంలో పలువురికి విక్రయించారు. వీటిని కొనుగోలు చేసిన వారు తమకు అనుకూలంగా ఇంటిని మార్చుకుంటున్న సమయంలో పీవీపీ అడ్డుకుంటున్నారని అనేక ఫిర్యాదులు పోలీసులకు అందాయి.

    రెండేళ్ల క్రితం కూడా ఓ వ్యక్తి తనకు సంబంధించిన విల్లాలో రినోవేషన్ చేసుకుంటుండగా పీవీపీ అనుచరులు అక్కడికి చేరుకొని ఆ ఇంటిని కూలగొట్టినట్టు కేసు నమోదైంది. ఇక ఈ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపైకి ఆయన కుక్కల్ని వదలడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసు వివాదాస్పద కావడంతో ఇప్పటికీ కూడా ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

    తాజాగా బీజేపీ నేత డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి ఇంట్లోకి వెళ్లి మరీ పీవీపీ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడటం చూస్తుంటే ఆయన ఎంత బరితెగించారో అర్థమవుతోంది. ఏపీలో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన పీవీపీ హైదరాబాద్లో దౌర్జన్యం చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులు సైతం సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. ఇదిలా ఉండగా పీవీపీ ప్రస్తుతం వైసీపీ పార్టీలో పెద్దగా యాక్టివ్ గా కన్పించడం లేదు. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తిని రేపుతోంది.

    Also Read:  విషాదం: ప్రముఖ తెలుగు నటుడు మృతి !