Homeఎంటర్టైన్మెంట్Indraja Daughter: హీరోయిన్ ఇంద్రజ కి ఇంత అందమైన కూతురు ఉందా.. ? హీరోయిన్స్ కూడా...

Indraja Daughter: హీరోయిన్ ఇంద్రజ కి ఇంత అందమైన కూతురు ఉందా.. ? హీరోయిన్స్ కూడా అసూయ పడేలా ఉందిగా..

Indraja Daughter: కొంతమంది హీరోయిన్స్ చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ , ప్రేక్షకుల్లో చెదరని ముద్ర వేస్తుంటారు. వాళ్లంటే ప్రేక్షకుల్లో మర్యాదతో కూడిన అభిమానం ఉంటుంది. సంసార పక్షమైన హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళు వీళ్లంతా. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ఇంద్రజ. ఈమె 1993 వ సంవత్సరం లో ‘ఉజ్జయిపల్లి’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఈమె ఒక చిన్న క్యారెక్టర్ మాత్రమే చేసింది. ఆ తర్వాత […]

Indraja Daughter: కొంతమంది హీరోయిన్స్ చేసింది తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ , ప్రేక్షకుల్లో చెదరని ముద్ర వేస్తుంటారు. వాళ్లంటే ప్రేక్షకుల్లో మర్యాదతో కూడిన అభిమానం ఉంటుంది. సంసార పక్షమైన హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళు వీళ్లంతా. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ఇంద్రజ. ఈమె 1993 వ సంవత్సరం లో ‘ఉజ్జయిపల్లి’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఈమె ఒక చిన్న క్యారెక్టర్ మాత్రమే చేసింది. ఆ తర్వాత ఈమె ‘పురుష లక్షణం’ అనే మరో తమిళ సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసింది. మన టాలీవుడ్ లోకి ఈమె ‘హలో బ్రదర్’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమాలోని పాపులర్ సూపర్ హిట్ సాంగ్ ‘కన్నెపెట్టరో’ పాటలో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది కానీ , పెద్దగా గుర్తింపు రాలేదు.

ఆమెకు హీరోయిన్ గా మొట్టమొదటి సారి మంచి గుర్తింపు ని తెచ్చిపెట్టిన చిత్రం ‘యమలీల’. SV కృష్ణా రెడ్డి , అలీ కాంబినేషన్ లో తెరెకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ఇంద్రజ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అలా గౌరవప్రదమైన పాత్రలు చేస్తూ వచ్చిన ఈమె , పెళ్లి తర్వాత క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుత తరం ప్రేక్షకులకు ఈమె వెండితెర కంటే బుల్లితెర ద్వారా బాగా పరిచయం. ‘జబర్దస్త్’ తో పాటు , పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ నేటి తరం బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.

ఇక ఈమె వ్యక్తిగత విషయాలకు వస్తే, ఈమె ప్రముఖ టీవీ సీరియల్ నటుడు , వ్యాపారవేత్త మొహమ్మద్ అబ్సర్ ని ప్రేమించి పెళ్లాడింది. ఈ జంటకు సరా అనే కూతురు కూడా ఉంది. రీసెంట్ గా ఆమె కూతురుకి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. చూసేందుకు కుందనపు బొమ్మ లాగా ఉంది , హీరోయిన్స్ సైతం అసూయ పడే రేంజ్ లో ఉంది అంటూ సోషల్ మీడియా లో సరా ని చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందాన్ని పెట్టుకొని సినీ ఇండస్ట్రీ లోకి రాకపోతే , ఇండస్ట్రీ కి అన్యాయం చేసినవాళ్లు అవుతారని అంటున్నారు. కానీ సరా కి సినీ ఇండస్ట్రీ పై ఆసక్తి లేనట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి సరా ఫోటోలను కొన్ని మీకోసం కింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper