
నందమూరి అందగాడు బాలయ్య బాబుతో సినిమా చేయడానికి ఒకప్పుడు ఎగబడేవారు. కానీ ఇప్పుడు ఆయన ఫైర్ బ్రాండ్, వరుస ఫ్లాపులతో సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు ముందుకు రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఫ్లాపులతో సతమతమవుతున్న బోయపాటి శ్రీను మళ్లీ బాలయ్యనే నమ్ముకున్నాడు. ఆయనతో మూడో సినిమా చేస్తున్నాడు.
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.
బోయపాటి అంటేనే ప్రయోగాలకు పెద్దపీట వేస్తాడు. ఈ క్రమంలోనే ఈ అరుదైన పాత్రలో బాలయ్య విగ్గు లేకుండా నటించబోతున్నాడట. బయట ఎలా ఉంటాడో, అలానే వెండి తెరపై కనిపించబోతున్నట్టు టాక్. బాలయ్య వెండి తెరపై ఇలా కనిపించడం ఇదే తొలిసారి.
ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య రెండు రకాలైన పాత్రలు పోషిస్తున్నాడని.. అఘోరాగా బాలయ్య ఇందులో నటిస్తాడని చెబుతున్నారు.అయితే అఘోర పాత్ర తీసేసి ఇప్పుడు విగ్గు లేకుండా మరో పాత్రను బోయపాటి డిజైన్ చేసినట్టు టాక్.
బోయపాటి సినిమాల్లో బాలయ్యను పవర్ ఫుల్ గా చూపిస్తారు. అలా వీరి కాంబినేషన్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ సరికొత్త పాత్రలో బాలయ్య ఎలా నటిస్తాడన్నది వేచిచూడాలి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇక బాలయ్యను ఆపడం ఎవరితరం కాదనకుంటా..