ఎన్నో కష్టాలు.. ఎన్నో అవమానాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చాక అటు ముఖ్యమంత్రి జగన్‌లోనూ.. ఆ పార్టీ నేతల్లోనూ ఎంతో ఉత్సాహం కనిపించింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరలోనే ఇప్పుడు ఆ కార్యకర్తల్లో జోష్ తగ్గినట్లుగా కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకొని జగన్ కూడా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తయింది.
Also Read: చీఫ్ జస్టిస్ కు లేఖ: జగన్ కోర్టు ధిక్కరణ కేసులో భారీ ట్విస్ట్
ఈ సందర్భంగా ప్రతీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు.. పార్టీ ఇన్‌చార్జీలు పది రోజులపాటు పాదయాత్రలు చేయాలని పార్టీ పెద్దలు ఆదేశించారు. కానీ.. క్షేత్రస్థాయిలో ఏ ఒక్క లీడర్ కూడా చేయలేదు. ఏదో తూతూమంత్రంగా కార్యక్రమం కానిచ్చేశారు. వీటిని చూసిన పలువురు ముక్కున వేలేసుకున్నంత పని చేశారు. ఇదేనా పార్టీ పట్ల వీరు చూపే చిత్తశుద్ధి అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
రెండేళ్ల క్రితం జగన్ ఒక్క పిలుపు ఇస్తే సొంత డబ్బులు పెట్టుకొని మరీ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చేవారు. టీడీపీ మీద ఒక్క లెక్కన గర్జించేవారు. జనాలకు నాటి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంలోనూ సక్సెస్ అయ్యేవారు. పోటీలు పడి మరీ సభలూ సమావేశాలు నిర్వహించేవారు. జగన్ సీఎం కావాలనే ఒకే ఒక్క ఎజెండాతో కట్టుబడి మరీ పనిచేసేవారు. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. తమకెందుకు వచ్చిన గోల అని అనుకుంటున్నారేమో ఈ కార్యకర్తలు. జగన్ అధికారంలోకి వచ్చాక పార్టీలో కార్యకర్తలకు సరైనా ఆదరణ లేకుండా పోయింది. దీంతోపాటు ఏడాదిన్నరగా పార్టీని జగన్ సహా అంతా మరచిపోయారు. ఇపుడు స్థానిక ఎన్నికలు ఉండడంతో ఉద్దేశంతో ఈ పాదయాత్ర ప్రోగ్రాంను డిజైన్ చేశారు. అందుకే.. తమను పట్టించుకోని పార్టీ కోసం తామెందుకు పనిచేయాలని క్యాడర్ కస్సుమంటోంది.
Also Read: బాబు బాటలో జగన్.. పుట్టిమునగడం ఖాయమా?
మరోవైపు.. వైసీపీలో అసలైన నాయకులకు పదవులు అధికారాలు లేవు. ఎమ్మెల్యేలు తమ సొంత వ్యాపారాలు వ్యవహారాలూ చూసుకుంటున్నారు. దానికి తోడు టీడీపీ నుంచి వచ్చిన నాయకుల హవా పెరిగింది. వారి పెత్తనం, సొంత పార్టీ నాయకుల ఉదాసీనత పెరిగిందనేది వారి భావన. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కూడా క్యాడర్ ఇలానే హ్యాండ్ ఇస్తే.. జగన్‌కు గడ్డుకాలమనే చెప్పాలి. అందుకే.. ఇప్పటి నుంచే ఆ దిద్దుబాటు చర్యలేవో ప్రారంభిస్తే పార్టీకి భవిష్యత్ ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్