https://oktelugu.com/

మోనాల్ ను కాపాడుతున్న ‘బిగ్ బాస్’.. ఈవారం ఎలిమినేషన్ ఉండదా?

బిగ్ బాస్ నాలుగో సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగుతోంది. గత సీజన్లలో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించే టాస్కులతో ఆకట్టుకోగా.. ప్రస్తుత సీజన్లలో మాత్రం అలాంటివి కరువయ్యాయనే ఫీల్ బిగ్ బాస్ అభిమానులు కలుగుతోంది. దీనికితోడు ఎలిమినేషన్ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో బిగ్ బాస్-4 టీఆర్పీ క్రమంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది. Also Read: ‘రాధేశ్యామ్’ నుంచి ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ఇదే ఇప్పటికే బిగ్ బాస్-4 సీజన్ ఏడో వారానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 12:47 PM IST
    Follow us on

    బిగ్ బాస్ నాలుగో సీజన్ గత సీజన్లకు భిన్నంగా సాగుతోంది. గత సీజన్లలో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించే టాస్కులతో ఆకట్టుకోగా.. ప్రస్తుత సీజన్లలో మాత్రం అలాంటివి కరువయ్యాయనే ఫీల్ బిగ్ బాస్ అభిమానులు కలుగుతోంది. దీనికితోడు ఎలిమినేషన్ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో బిగ్ బాస్-4 టీఆర్పీ క్రమంగా పడిపోతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ‘రాధేశ్యామ్’ నుంచి ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ఇదే

    ఇప్పటికే బిగ్ బాస్-4 సీజన్ ఏడో వారానికి చేరుకుంది. ఆరుగురు కంటెస్టులు హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈవారం మరొకరు హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ వారం నామినేట్ అయిన వారిలో మొనాల్.. నోయల్ కు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

    నోయల్ కంటే కూడా మొనాల్ ఓటింగులో కొంచెం వెనుకంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ ఎత్తివేస్తాడనే ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మొనాల్ పట్ల సాప్ట్ కార్నర్ తో ఉన్నాడు. అలాగే బిగ్ బాస్ లో మొనాల్.. అభిజిత్.. అఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడుస్తోంది.

    ఈవారం మొనాల్ ను బిగ్ బాస్ నుంచి తప్పిస్తే ట్రయాంగిల్ లవ్ ట్రాక్ మూలనపడనుంది. ఇప్పటికే ఈ షోకు ప్రధాన ఆకర్షణగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీనే నడుస్తోంది. దీంతో మరికొన్ని రోజులు దీనిని కొనసాగించాలని బిగ్ బాస్ భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే ఈ వారం ఎలిమినేషన్ ఎత్తేసి మొనాల్ ను సేఫ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

    Also Read: జక్కన్నపై కాపీ మరక.. ఇలా బుక్కయ్యడెంటీ?

    బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఇప్పటికే తన సినిమా షూటింగు కోసం కూలుమానాలి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సాకుతో ఈవారం ఎలిమినేషన్ ఎత్తేసి వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ చేస్తారని ట్వీస్ట్ ఇవ్వనున్నారట. ఒకవేళ బిగ్ బాస్ ఎలిమినేషన్ చేయాల్సి వస్తే మాత్రం మొనాల్ హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదనే టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ మొనాల్ ను ఒకసారి సేవ్ చేశాడు.. దీంతో మరోసారి ఆమె సేఫ్ అవుతుందా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది.