https://oktelugu.com/

రైతుల కోసం మోడీ మరో గొప్ప పథకం..

దేశంలో దాదాపు 60శాతం ఉన్న రైతులకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తుంటాయి. సీఎం కేసీఆర్ అయితే తెలంగాణను రైతు రాజ్యం చేశారు. కేసీఆర్ అమలు చేసిన రైతులకు నగదు బదిలీని మోడీ కూడా కాపీ కొట్టి దేశమంతా అమలు చేశాడు. తాజాగా రైతుల కోసం మరో కొత్త స్కీమ్ ను ప్రధాని మోడీ తీసుకొస్తున్నారు. Also Read: బీహార్‌‌ ఎన్నికలు: కాంగ్రెస్‌ బలం ఎంత? అక్టోబర్ 24న ఈ కొత్త పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2020 / 12:44 PM IST
    Follow us on

    దేశంలో దాదాపు 60శాతం ఉన్న రైతులకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తుంటాయి. సీఎం కేసీఆర్ అయితే తెలంగాణను రైతు రాజ్యం చేశారు. కేసీఆర్ అమలు చేసిన రైతులకు నగదు బదిలీని మోడీ కూడా కాపీ కొట్టి దేశమంతా అమలు చేశాడు. తాజాగా రైతుల కోసం మరో కొత్త స్కీమ్ ను ప్రధాని మోడీ తీసుకొస్తున్నారు.

    Also Read: బీహార్‌‌ ఎన్నికలు: కాంగ్రెస్‌ బలం ఎంత?

    అక్టోబర్ 24న ఈ కొత్త పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారు. గుజరాత్ లో ఈ పథకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

    గుజరాత్ రైతుల కోసం మాత్రమే ప్రస్తుతం ఈ పథకం పెట్టారు. ఆ తర్వాత హిట్ అయితే దేశవ్యాప్తంగా బీజేపీ సర్కార్ విస్తరించే ఆలోచనలో ఉంది.

    అక్టోబర్ 24న కిసాన్ సూర్యోదయ యోజన పథకాన్ని తీసుకు వస్తున్నారు. కేవలం ఈ కొత్త స్కీమ్ మాత్రమే కాకుండా రెండు ఇతర ప్రాజెక్టులను కూడా లాంచ్ చేయనున్నారు. రైతులకు నిరంతరం విద్యుత్ అందించడమే ఈ కొత్త స్కీమ్ ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైతులకు కరెంట్ అందుబాటులో ఉంటుంది. దీనికోసం గుజరాత్ సర్కార్ ఏకంగా 3500 కోట్లు కేటాయించింది.

    Also Read: బీజేపీకి కేటీఆర్‌‌ మార్క్‌ పంచ్‌

    ఇప్పటికే సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. అయితే గుజరాత్ సర్కార్ మాత్రం పూర్తిగా కాకుండా ఏకధాటిగా ఇస్తోంది. అయితే ఇది ఉచితంగానే లేదా డబ్బులకే అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.