Paatal Lok web series : క్రైమ్ థ్రిల్లర్స్ కి ఓటీటీలో భారీ డిమాండ్ ఉంది. పలువురు టాలెంటెడ్ డైరెక్టర్స్ అద్భుతమైన కంటెంట్ తో సిరీస్లలో రూపంలో క్రైమ్ డ్రామాలు తెరకెక్కిస్తున్నారు. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో సాగే ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ప్రేక్షకులు వీటి పట్ల ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఓటీటీ సంస్థలు సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ని అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ఓ క్రైమ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.
పాతాళ్ లోక్ టైటిల్ తో ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కింది. నిజానికి పాతాళ్ లోక్ రీసెంట్ గా విడుదలైన సిరీస్ కాదు. 2020లో హిందీలో విడుదల చేశారు. అప్పట్లో పాతాళ్ లోక్ అత్యంత ఆదరణ పొందింది. ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఎపిసోడ్లో ట్విస్ట్స్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ డ్రామా ఉత్కంఠ రేపుతుంది. సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగిస్తాయి.
పాతాళ్ లోక్ సిరీస్ కి సుదీప్ శర్మ దర్శకుడు కాగా జైదీప్ ఆహ్లావత్, నీరజ్ కబీ, అభిషేక్ బెనర్జీ, గుల్ పనాగ్ ప్రధాన పాత్రలు చేశారు. పాతాళ్ లోక్ తెలుగు వెర్షన్ కోసం చాలా కాలంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ పాతాళ్ లోక్ సిరీస్ ని తెలుగులో అందుబాటులోకి తెచ్చింది. దీంతో క్రైమ్ థ్రిల్లర్స్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ లో పాతాళ్ లోక్ సిరీస్ తెలుగులో చూసి ఎంజాయ్ చేయవచ్చు. పాతాళ్ లోక్ కథ విషయానికి వస్తే… ఒక జర్నలిస్ట్ దారుణంగా చంపబడతారు. ఈ హత్య సంచలనం రేపగా సుదీర్ఘ అనుభవం ఉన్న పోలీస్ అధికారి హతిరాజ్ చౌదరిని రంగంలోకి దింపుతారు. ఈ హై ప్రొఫైల్ కేసులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని హతిరాజ్ తెలుసుకుంటాడు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. అసలు జర్నలిస్ట్ హత్య వెనుక ఉంది ఎవరు? ఎందుకు చేశారనేది? అసలు కథ…
