https://oktelugu.com/

Director Harish Shankar : దమ్ముంటే నా పేరు రాయండి, అన్నింటికీ తెగించే పరిశ్రమకు వచ్చా… ఫైర్ అయిన హరీష్ శంకర్

గతంలో రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్. ముచ్చటగా మూడోసారి ఇద్దరూ కలిసి చిత్రం చేస్తున్నారు

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2024 / 09:34 AM IST
    Follow us on

    Director Harish Shankar : దర్శకుడు హరీష్ శంకర్ ముక్కుసూటి మనిషి. తనపై వచ్చే ఆరోపణలు, గాసిప్స్ , ట్రోల్స్ కి నేరుగానే స్పందిస్తాడు. తాజాగా ఆయన ఓ సినిమా వేదికపై సంచలన కామెంట్స్ చేశాడు. రవితేజ లేటెస్ట్ మూవీ ఈగల్. ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఈగల్ మూవీ సక్సెస్ మీట్లో హరీష్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన రివ్యూలు రాసే వెబ్ సైట్స్ మీద మండిపడ్డాడు. చెప్పాలంటే ఆయన వార్నింగ్ ఇచ్చాడు.

    హరీష్ శంకర్ మాట్లాడుతూ… నేను సినిమా చూడకముందే రివ్యూలు చదువుతాను. ఓ వెబ్ సైట్ ఈగల్ చిత్రానికి నెగిటివ్ రివ్యూ ఇచ్చింది. మరో సైట్ లో పరోక్షంగా నా గురించి రాశారు. వాళ్లకు ధైర్యం ఉంటే నేరుగా నా పేరు రాయాలి. నేను అన్నింటికీ తెగించే పరిశ్రమకు వచ్చాను, అన్నారు. హరీష్ శంకర్ పరుష వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హరీష్ శంకర్ ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నారు. ఇది సెట్స్ పై ఉంది.

    గతంలో రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్. ముచ్చటగా మూడోసారి ఇద్దరూ కలిసి చిత్రం చేస్తున్నారు. కాగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి తాత్కాలిక బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కనుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి సమయం ఉండగా ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ పూర్తి చేస్తున్నారు.

    ఇక ఈగల్ విషయానికి వస్తే యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈగల్ తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈగల్ మొదటి రెండు రోజులు ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. రెండు రోజులకు పదికోట్ల షేర్ వసూలు చేసింది. రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈగల్ బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాల్సి ఉంది.