గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన శాఖలో జరిగిన అవినీతిపై ఇటీవల జైలు శిక్ష కూడా అనుభవించాడు. తాజాగా.. ఆయనకు టీడీపీ అధినేత ఏపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రాజధాని విషయంలో అచ్చెన్నాయుడు అధికార పార్టీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. గతంలో చంద్రబాబు ప్రజాభిప్రాయసేకరణ కోసం ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.
Also Read: జగన్‌కు చంద్రబాబు ఫోబియా!
అయితే.. వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు భిన్నమైన ప్రచారం చేస్తున్నారు. రాజీనామాలు చేయాలని సవాళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ సహా అందరం రాజీనామా చేసి తేల్చుకుందామని అయ్యన్నపాత్రుడు సవాల్ చేయడంతో దానికి వైసీపీ నేతలు సైలెంటయ్యారు. కొద్ది రోజుల కిందట మంత్రి అప్పలరాజు కూడా తన స్థానం నుంచి రాజీనామా చేస్తానని రాజధాని ఎజెండాగా తనపై పోటీచేయాలని టీడీపీ నేతలకు సవాల్ చేశారు.
తర్వాత టీడీపీ నేతలే రాజీనామా చేయాలని మాట మార్చారు. తాజాగా.. అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర విషయంలో కీలకమైన సవాల్‌ను వైసీపీ నేతల ముందు పెట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న సమయంలో టీవీచానళ్లతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో తన వైఖరిని స్పష్టం చేశారు. వైసీపీకి దీటుగా సమాధానం చెబుతున్నారు. తనతో సహా ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులందరం రాజీనామా చేద్దామని.. రాజధాని ఎజెండాగా ఎన్నికలకు వెళ్దామని ప్రజాభిప్రాయం ఏంటో తెలిసిపోతుందని సవాల్ విసిరారు.
Also Read: నేనింతే.. నా నిర్ణయమే ఫైనలంటున్న బాబు
అయితే.. ఈ రాజధాని అంశంపై అటు ఉత్తరాంధ్రలోనూ పెద్ద ఎత్తున సెంటిమెంట్ ఏర్పడిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ప్రజల్ని భయపెట్టి నోరు తెరవకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక వైసీపీ నేతలు చేస్తున్న దందాల కోసమే రాజధాని పేరుతో హడావుడి చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు తరచూ ఎన్నికల ప్రస్తావన తెస్తుండటంతో టీడీపీ దాన్ని మరింత విస్తృతం చేస్తోంది. మరి.. ఈ రాజీనామాల రాజకీయం చివరకు ఎటు దారితీస్తుందో తెలియకుండా ఉంది.